పుట:Bhaarata arthashaastramu (1958).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మకరులు మృగములు జడములుగారుగాన వారి మనస్సులను ఆకర్షించునట్టి విధానము లున్నంగాని మొత్తముమీద ననర్థమే ప్రాపించును. మనవారు భయముచేతనే కర్మసాఫల్యము నొందజూచెదరు. ఇది తెల్వితక్కువపని. తనకు నేశుభమునులేనిది వెఱపున్నను నిండుమనసుతో నెవ్వడును గృతయత్నుడుగాడు. ప్రయత్నశీలత జయోత్సాహసంజనితము. జయము మాయమైన నుద్యోగము నస్తమించు.

"అవునుగాని ఎక్కువ కూలియిచ్చిన నాకూలి కల్లంగడిలో వినియోగమగువఱకును మఱల బనికిరారు. లంఘనమువలె లక్షణములు పురికొల్పజాలవు" అని కొందఱాక్షేపింపవచ్చును. ఇందు కొంత నిజమున్నది. అయిన నింకను విమర్శింతము.

అధమవర్ణస్థులు చేతి కించుకడబ్బు తగిలినతోడనే ఇంకను ఆర్జింపవలయునను కోరికగొనక పనివదలి మధుమాంసాదులకు వెచ్చింతురు. ఈరీతి నితరులేలచేయరు? కారణము స్పష్టము. పూర్వహింసలచే బట్టువడిన వాడుకలంబట్టి, ధనముగూడబెట్టిన నేమహాత్ముడైనను "ఓహీనుడా! నీకు ధనమెందుకు?" అని శాస్త్రముచేతనో శాసనముచేతనో లాగుకొందురను నివ్వెఱపాటుచే "వచ్చినమాత్రం లాభము. ఇప్పుడే తిని త్రాగిన గ్రక్కించి నాకబోరుగదా" యని నికృష్టులైనవారు నిరాసచే నర్థార్జనమున కుద్యమింపరు. సోమరితనము, కలిగినప్పుడు కల్లంగడికిబోవుట, లేనివేళ దీనతతోవేడి యాశ్రయించుట ఇత్యాది దుర్గుణములకు హింసాపరులై యగ్రజాతులవారు బలియురగుటంజేసి విధించిన యాచారములే మూలాధారములు. ఈ కార్యములు బ్రాహ్మణాదులయందు వర్తింపవుగాన వారిలో ఆశ, ఉత్సాహము, వసూత్పాదనాసక్తి. ఎడతెగక శ్రమజేయుశక్తియు నెలకొనియున్నవి. ఈ దు:ఖసాగరము నంత్యజులు - కడవనీదవలయునని కరుణగొంటిమేని రిక్తవాక్యముంవిడిచి వారు దరిజేరిన నీర్ష్యచే