ఈ పుట ఆమోదించబడ్డది
జూడక మామూలు జీతముమాత్రమిచ్చుట, అల్పవేతనములు, విరామమేలేక పనిదీయుట, క్రమములేని కర్మలను విధించుట ఇత్యాదులు.
ఇంగ్లీషువారి యిండ్లలో సేవకులు చుఱుకుదనమున బనిజేతురు. మన యిండ్లలోనివారు మునికోలతో బొడుచుచున్నను కదలరు. కారణమేమి? స్వదేశీయులయు విదేశీయులయు గృహసేవా పద్దతులంబోల్చి చూతము.
ఇంగ్లీషువారి పద్ధతి | హిందువుల యాచారము |
1. నెలకు ఎనిమిది రూపాయలు మొదలు ఇరువది వఱకును సంబళము | 1. అన్నమువేసి రెండు మొదలు నాలుగు రూపాయలవఱకును నెలకూలి. |
2. పరిచారకులకు పనిపోయిన నేమిగతియని భయము గల్గియుంట | 2. పనిపోయిననేమి: ఇంతకన్న నధమస్థితి రాబోవునాయను నిరాశ ధైర్యము |
3. తప్పుచేసిన, పాత్రలను విఱుగగొట్టిన నపరాధము వేతురు. ఇచ్చియైన పని నిలుపుకొనుటమేలని సేవకులుభరింతురు. | జీతము స్వల్పముగాన జల్మానాలకు వీలులేదు. అందులకు బదులుగ గడుపార దుర్బాషలతోదిట్టి చిన్నబిడ్డలకుగూడ భాషాజ్ఞానము గలుగజేతురు. |
4. సేవకులు రాజోద్యోగస్థులట్లు భయముతో వర్తింతురు. | 4. యజమానురాలు పనికత్తెలు అప్పుడప్పుడు ములుకులవంటి ముచ్చటలను బ్రయోగించుటయు గలదు. |
5. సేవకులకు కర్మలు నియతములు. అవిచేసి ముగించినవెనుక యింటిముందఱ విరామముగా బిలిచిన బలుకునట్లు గూర్చుండియున్నను యజమానులు దోషమని తలవరు. ఎంత త్వరలో బనిజేసిన నంత విరామము దొరకునను నావేగమున బనిజేతురు: | 5. క్రమములేని పనులు గావున ఒక్కపనియయి కాకమున్నె రెండు పనులు పెట్టుదురు. ఎంతచేసినను విరామ మియ్యరు గావున పనులను ముగించిన ప్రమాదమని సోమరితనమున దూగుచు నిదానముగ జేతురు. చొఱవచేత నష్టము గలిగినచో మాంద్యము నెవ్వ డవలంబించడు. |
6. నచ్చులేని పని. కాలము మిగులుట. ఆలస్యము లేకయుండుట. యజమానులకు గోపము మొదలగు చిత్తక్షోభము లవసరము లేకుండుట. ఇవి ఫలములు | 6.ఫలములు మీకనుభవ వేద్యములే గాన వర్జన లధిక ప్రసంగములు. |