పుట:Bhaarata arthashaastramu (1958).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱల దోయకుండుటయగాదు. నివసించుటకు వసతులను నేర్పఱచినంగాని వారు గడిదేరుటయు గడిదేరవలయునను ఇచ్ఛయు నసంభావ్యంలౌను. ఇది సులభసాధ్యము గాకున్నను కిరాతహృదయము లేనివారెల్లరు నాదరముంచి సహాయపడవలసిన ధర్మోద్యమంబు.

జయమెంత శీఘ్రముగ సిద్ధించునో యంత యాతురతతో బనిచేయుదుము. శూద్రులు మొదలగు వారలకు "ఇంకొక జన్మములో సర్వశోభనములు సిద్ధించును. ఇప్పటికిమాత్రము నిరాశగానుండి యార్జించినది గొప్పవారికి దానము చేయుడు" అని బోధించిన నింకొక జన్మమనునది యెప్పుడో, యేయుగముననో "కాశీలో దొంగలించుటకు రామేశ్వరమునుండి వంగికొనుమన్నట్లున్నది" అని యదైర్యపరులై విశ్రాంతిజెందుదురు. కావున కాలమును ముఖ్యము, చిరమునకన్న నచిరము ప్రోత్సాహకరము. ఇందుచే బ్రత్యక్షమే పరమమూల్యమని భ్రమింపరాదు. అచిరమనగా నించుమించు లెక్కకు వచ్చుకాలమనియర్థము. ఎవ్వరికిని గుఱుతులేని మన్వంతరములనికాదు.

కూలిపనికన్న సొంతపని యెక్కువ సమర్థమనుటకొక నిదర్శనము. భృత్యులకు బని ముగించినవెనుక జీతముల నిత్తురు. అనగా పనిముందు ఫలము తదనంతరము. సొంతపనిలో నట్లుగాదు. పనియు ఫలమును సమకాలికములు. ఎట్లన, కార్యము నడుచుటయే ఫలము. సేవకులకు కార్యము ఫలముగాదు. జీతము ఫలము. కార్యము నిష్కర్ష. ఎందుకన అది ముందుముగింపునకు వచ్చునది. బత్యము దానిని వెంబడించునదిగాన నది కార్యముతోబాటు నిశ్చయము గలదిగాదు. తమపని తామేచేసిరేని కార్యమెంత నిశ్చయమో ఫలమునంతే నిశ్చయముగాన ఎక్కువ పూనికతో ప్రారంభింతురు.

స్వామ్యము సామర్థ్యాతిశయమునకు ప్రబలకారణము. నిద్రకనులతో గూలిజేయువాడుసైతము నీకేయని కొంత భూమి నిచ్చితిమేని రేయనక పవలనక భూమిని దినదినము బిడ్డమాదిరిగ నరయుచు