పుట:Bhaarata arthashaastramu (1958).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ తెలివితేటలలో ముఖ్యములైన గుణములు తత్పలములు

గుణములు:--ఆజ్ఞలను శీఘ్రముగా గ్రహించుట, గ్రహించిన దానిని మఱువకుండుట. చిత్తవైశద్యము. విచారశక్తి. ఏకారణముచేత నీయారీతులు జేయుచున్నానని కార్యముయొక్క కారణములను దెలిసికొనవయుననెడి కొతూహలము. కొందఱు పశువులపోలిక గ్రుడ్డి తనముగా జెప్పింట్లు వోదురు. అట్టివారికి మనసున్నతో లేదో యను శంకయు బొడము.

జర్మనీ, ఇంగ్లాండు, స్కాట్లండు, అమెరికా దేశాముల యుతర భాగములోని శిల్పులు ప్రజ్ఞలో ప్రధములు.

ఐరోపా, అమెరికా, జపాను దేశములలో చదువు సర్వసామాన్యము. ప్రతిబాలుదును ఐదేండ్లుమొదలు పదునాలుగేండ్ల వఱకుకు బడికి బోయితీరవలసినదని రాజాజ్ఞయౌట చదువను వ్రాయను దెలియని స్త్రీలైన నారాజ్యములలేరు. అట్లు విద్యాశాలలకుంబోక నిలిచిరేని తల్లిదండ్రులు దండ్యులౌదురు. ఇంగ్లాండులోని పద్ధతి యిపుడు 40 సంవత్సరములుగ నడచుచున్నది.

మనదేశమున నగ్రజాతివారు తమయగ్రతకు నంతము వచ్చునను భయంబున, శూద్రులు మూఢులుగానున్ను దమకుమేలని, విద్యా దానము వారికి గూడదని నియమించి పాపము గట్టుకొనిరి. మూఢమతమునకు మూఢత యాధారము గావున, నీమార్గమున బౌరాణిక మతము శాశ్వతముగానిలిచి, తమకు గొప్పపదవియు నాదాయమును స్థిరముగ నిల్చుననియెంచి దేశము చేటునకోర్చి తాముమాత్రము పచ్చగానుండ బ్రయత్నించిరి. ఆంగ్లోమహాజనుల ప్రషాదమున నీనాట్కి వర్ణ భేదములు లేక విద్దెవ్యాపించుచున్నదిగాని, యుగముల నుండివచ్చు నాచారము లింకను విఘ్నకరములుగా నున్నవి. యుక్తాయుక్త వివేకము లేనివారికి అలవాటులే నీతి మార్గములు. అట్టివారిని