పుట:Bhaarata arthashaastramu (1958).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనిచే జీతము సేగి యొకటేనా, పనిక్రమమును దప్పును. మాటప్రకారము సరకుదింపి వర్తకుల కిచ్చుటకుగాదు. అందుచే వారికి నష్టము గట్టియిచ్చుట, వాడుకచెడగొట్టుకొనుట మొదలగు బాములు ప్రాప్తించును. తమవెచ్చమును కాసైనబోక కట్టియిచ్చునంత లాభ మప్పుడే వచ్చినదని కాడ్ బరీ లనియెదరు! దూరపుజూపుగాజూచిన ధర్మమే జయమనుట బొంకుగాదు. అప్పటి కననుకూలముగా దోచినను మునుపటికి మోసములేదు.

కాడ్ బరీల చందాన 'లీవర్‌' వారు సబ్బుఫ్యాక్టరీల స్థాపించుకొఱకు 'సన్‌లైటు' రేవును, అమెరికాలో ఇనుము ఫ్యాక్టొరీల పనివారికై 'పిట్స్‌బర్గ్‌' ను ఇట్లనేక వ్యాపార ధురంధరులు కర్మకర గ్రామముల స్థాపించి ఇతరులతోసహా తమకును శ్రేయస్సు బడసియున్నారు. ఇపుడు బంగాళాలో నేర్పాటునకు వచ్చు అయ:కర్మశాలవారును ఇంకను గొందఱు ఈ యుద్దేశములచే వేతనకారులకు నివాసములను ఫ్యాక్టొరీల పరిసరభూముల నీదేశములో గట్టుచున్నారు. మనపనివారు యజమానుల కన్నుండిననేగాని కనుమఱుగౌవారుగావున విదేశములకన్న నీధర్మపద్ధతి యిచ్చట గార్యానుకూలతకు సాధనము.

యంత్రకళలలో దేహబలముకన్న మనోజాగ్రత్త మిగుల ముఖ్యము. కావున మనసులకు నలజడిగాన కుండునట్లు బొమ్మలు చిత్తరువులు ఇట్టివినోదములచే కర్మశాలల నలంకరించుటయుం గలదు. కండలశక్తికన్న బుద్ధిజాగరూకత శ్రేష్ఠము గావున మనము సవికాసముగా నుంచుట తగును.

5. తెలివితేటలు. ఆధునిక కళలలో తెలివితేటలు లేనివారు దక్షులు గానేరరు. తెలివితేటలు శిల్పప్రావీణ్యమును భిన్నములు. శిల్పప్రావీణ్యమనగా అభ్యాసాదులవలన నేర్చిన క్రియలలోని నైపుణి. మతిమంతుడనగా నేపనినైనను యోచనతోజేసి త్వరలో నేర్చుకొను శక్తిగలవాడనుట. అల్పబుద్ధిగల వాడైనను నిరంతర పరిశ్రమచే రచనాసమర్థుడు గావచ్చును.