పుట:Bhaarata arthashaastramu (1958).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదో? ఆకలిచే జచ్చువాడు దానికన్న నజీర్ణ బాధయేమేలని తలచుగాదే? కావున పాశ్చాత్యుల పాలిపెద్దమ్మను మనము లక్ష్మీదేవియనియే కొనియాడవచ్చును.

6. పూర్వోదితరీతి నితరులకు భరణప్రాప్తియై మొత్తముమీద రాజ్యము బాగువడినను యంత్రములచే స్థానభ్రష్టులైన కర్మకరులకు నదియొక సమాధానము గాదుగనక వారుహింసగండ్రు. చూడుడు! ట్రాంబండ్లచే కూలిగోలుపోయిన జట్కాబండ్లు తోలువారికి ఇంకెవరో కల్లుద్రావక భార్యలకు బంగారు సొమ్ములు పెట్టుటచే గడుపుచల్ల నవునా? దేశమునకు మేలయుంటిమి. ఉండనిండు! వారిగతియేమి? అమెరికాలో 180 లక్షలమందికి శ్రమ మిగిలింపబడెననియు జెప్పితిమి గదా! తినుటకు తియ్యగ నన్నియునున్న శ్రమమిగిల్చినను మేలే. ఆ శ్రమచేతనే జీవనము జరుగవలసియున్నపుడు దానిని మిగిలించిన యెడల నేదేవునకు ప్రీతి?

వృద్ధియొక్క లక్షణము

యంత్రములచేత కొందఱికి కీడుమూడుననుట నిజమే. ఎవ్వరి కెన్నండును ఎట్టి కష్టమును గలుగదనుట బాధితమైన యతిశయోక్తి. ఇందుచేత యంత్రములు హానికరములనియు త్యాజ్యములనియు భావించుట యవివేకము. యంత్రకళలేగావు. ఏవిధమైన వృద్ధికిని తద్విరుద్ధమైన వస్తుక్షయంబు ముఖ్యంబు. ప్రాచీనులు వచించినట్లు లయమును సృష్టికి బ్రధానము. నూతనముగ మేడగట్టింపవలయునన్న ప్రాత గోడను బగులగొట్టింపవలసినదే. బిడ్డను బెంచవలయునన్న తల్లికిబాలు నష్టమౌను. అనేకులు వీరస్వర్గగతులైనంగాని రణమున విజయమురాదు. కావుననే స్వపరమైన దృష్టితోజూచు నికృష్టాత్ములు పురోవృద్ధియం దనాదరులై యుండుట. జనసామాన్యమునకు మేలుగలిగినను తమకుం గలుగునను నిశ్చయము లేదుగాన అట్టివారు 'కష్టించి ఫలమేమి' యని తమతమ పనులనుమాత్రము చూచుకొని సంఘమేగతిబోయిన