పుట:Bhaarata arthashaastramu (1958).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రుప్పుపట్టిచెడును. యంత్రములు బీగములవలె వాడుచుండిననేగాని లేనియెడబీడువడును. భూమి యలసి విస్సారమైవుండు వేళల యంత్రములతో నుసిగొల్పగాదు.

ఇట్లనుటచే యంత్రములు శుద్ధముగ నసేవ్యములని యెన్నబోకుడు. ఐరోపా, అమెరికా దేశములలో మైళ్ళకొలది విస్తీర్ణమైన క్షేత్రము లుండబట్టి దున్నుట, కోయుట, పాఱుదల ఇత్యాదులు యంత్ర మూలముగజేతురు అయినను వినిమయ పరివర్తన తంత్రం జులంబలె కృష్యాదుల యంత్రములు ప్రశస్తములుగావు. అనగా పోల్చి చూచిన నల్పశస్తములనుటగాని బొత్తిగా శస్తములే కావనుటగాదు.

కావున యంత్రములచే నాహారపదార్థము లపారములై ఆకలి యనునది యెట్టిదో యనునట్లు సుభిక్షత వెలయుజేయుననుటకల్ల. తిండిలేక తల్లడిల్లుదుమేని యంత్రములచే నెన్నిసింగారములు లభించిన నేమి? భోజనముమట్టై కట్టను దొడుగను నిట్టలముగనున్నను ఇంద్రుని నీటు మనకురాదు.

4. గృహనిర్మాణమునందును యంత్రము లల్పప్రయోజకములు. జనసామాన్యమునకు ముఖ్యముగా వలసినవిరెండు. ఉదరపోషణము, నివాసస్థానము ఈ రెంటియందును యంత్రము లంత యుపయోగ కరములుగావు.

5. ఐరోపాలో యంత్రములవల్ల అత్యుత్పత్తికలిగి అతివృష్టిరీతి నుపాధి కాస్పదమౌటయు సకృత్తుగ గలదు. యంత్రశాలలు నూరక నిలిపిన సాధనములు చెడునుగాన సరకులెంతయున్నను వెలలు పాడైనను వెనుదీయక నిరంతరోత్పత్తికింబూని యొండొరుతో స్పర్థించి తాము జెందుటయేగాక, అన్నిసరకులును బరస్పర సంబంధము కలవిగాన, ధరల నెల్ల నుయ్యాలలూగించి దేశమును క్షోభాస్పదముగజేతురు. ఇది నిజమైన కష్టమేగాని, మనదేశములో నంకురించు నాపదగాదు. ఆధిక్య ప్రయుక్తబాధలు ఇంకను గొన్నిశతాబ్దములకైనం నిట బ్రవేశించునో