పుట:Bhaarata arthashaastramu (1958).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేమియనియుందురు. ఇందుచే ముందు వీరికిని చేటుమూడుట నిజమని ఇదివఱకే వివరించితిమి. చూడుడు! ప్రతిభటుడును "జయము నొందిననేమి? నేను బ్రతికి రాగలనో లేదో? ఒకవేళ నేను జచ్చితి నేని దేశమంతయు నైశ్వర్యవంతమైయున్నను నాకేమిలాభము? ఎవ రెట్లైననుసరే. తప్పక నేనుమాత్రము జీవముతో నిలుతునని దేవుడు వరమిచ్చినంగాని యుద్ధమున కుద్యుక్తుడంగాను" అని యోచించెనేని పరాజయముమాడయేల, యాసైన్యము యుద్ధమునకేతొడంగదు. అట్లుండు మూకల శాత్రవు లరటిమ్రాకుల గూల్చినట్లు పడగొట్టుదురు. తనపరముగాక సంఘపరమైన దృష్టితో గణించువారు తమకెట్టి పాడైననుసరే, రాజ్యమైన బాగుపడిన జాలుననియు, సంఘ మడుగంటిన నెట్లును తమకును మానప్రాణపరిహారము తప్పదనియుదలంచి ఇహపరములం దొక్కెడనైన సుఖమును గీర్తియుం గాంక్షించి యుద్ధోన్ముఖులై మగంటిమిం బ్రకటింతురు. అందుచే దమకును జయమబ్బిన నబ్బవచ్చును.

కావున ప్రవర్తనలు యుక్తములా, అయుక్తములా, యని చర్చించువేళల సంఘపరమైన బుద్ధితో మేలుగీళ్ళ తూచిచూచి, మొత్తముమీద సమూహమునకు మంచివని యేర్పడిన నాచర్యలు అవశ్యానుష్ఠేయములని గ్రహించి ప్రవర్తించుట యొక్కటే యిహపర సాధనంబైన తత్త్వంబు. అప్పటముగ మేలుమాత్రముగలిగించు క్రియ లీలోకంబునలేవు. "కష్టములేనిది ఫలములేదు" అనునట్లు ప్రతిఫలమునకు సుంకమురీతిని కష్టమొండు విధింపబడియున్నది. ఈ కష్టము "నామీదబడునో నీమీదబడునో" యని వెఱచువారు పిఱికి పందలు. అట్టివారికి బానిసతనమే ముమ్మాటికిసిద్ధము. కావున యంత్రకళలు నిష్కృష్టముగ ఉపకార మొనరించునవి గాకున్నను సమష్టిని శ్రేయస్కరంబులౌట సంగ్రహణీయములుగాని నిగ్రహణీయములుగావు.

7. యంత్రములలో నేకపరిమాణ రూపములుగల వస్తువుల జేయవచ్ఛుగాన వానిలో నేదైననొకభాగము విఱిగినచో మరామత్తు