పుట:Bhaarata arthashaastramu (1958).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1904 సంవత్సరములో 13 కోట్ల వెలగలసరకు పరదేశయాత్రవెడలెను. ఈ నారవలె స్వదేశాభిమానము గల చేతనాచేతనము లెవ్వియులేవు. ఏలన ఇది హిందూదేశమునందుదప్ప మఱెచ్చటను ఎదుగదు. దేశము విడిచిన ప్రాణమువిడుతుమనువారు మనదేశములో ననేకులు. ఈవిషయమున గోగునారవంటి యోగ్యులేరునులేరు. ఇకముందు "వందే మాతరం" అని అభివాద నాశీర్వాదములు చేయుటకుబదులు "గోగునారవంటివారు గండు" అనిన నెంతో స్వారస్యముగ నుండునని నాయభిప్రాయము. దీనియందు మనకు నేకచ్ఛత్రాధిపత్యము గలదుగాన వెలలు హెచ్చుచేసినను అమెరికావారు మొదలగు వాడుక వారు మనయొద్దనే కొనవలసినవారుగానున్నారు. ఈ విషయంబటుండ నిండు. యంత్రప్రాబల్యము హస్తకళల నంతమొందించినది. చేతితో సిద్ధపఱుపబడు సరకులు బహ్వల్పములు. పూర్వమువలె సంచులు, గోతములు, నారచాపలును అట్టె కరకృతములుగావు.

కాకితములు

చేతితో జేయబడు కాగితములు ఈ దేశములో నున్నవారేవాయని సంశయింపవలసినంత తక్కువయైనవి. తక్కువమాత్రమే గాదు. మిక్కిలి మోటుగనుండుటచేత బొట్లములు గట్టుటకును దగనవిగానున్నవి. పూర్వమొకానొకప్పుడిది యాద్యంతమును చేతికి జేరినపని. ఇప్పుడు వానికి చేతివాసన యనునది తగులదు. యంత్రకళల పోటీయను వెల్లువలో హస్తకళలుబడి కొట్టుకపోవు చున్నవి. ఏలన యంత్రకళలలో నుత్పత్తిమేలు. ఎక్కువ. వెలయుతక్కువ.

ఈదేశములో బొంబాయిరాజధానిలో నాలుగును, బంగాళాలో నాలుగును, యునైటెడ్ ప్రావిన్‌సెన్‌లో ఒకటియు నంతుమొత్తము 9 కాగితములశాలలు 59 లక్షల మూలధనమును, 4,500 మంది పనివారునుగలవి 1904 లో నుండినవి.

ఈ దీర్ఘ చర్చవల్ల దేలిన విషయము లేమన్నను:-