పుట:Bhaarata arthashaastramu (1958).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముల్లేసాధన" మన్నట్లు, యంత్రబలములచే మన వృత్తులపై ధాటి చేయువారిని యంత్రబలముతోనే యెదిరించుటతప్ప వేఱొండు జయ ప్రదోపాయంబులేదు. స్వదేశవిషయక ప్రతిజ్ఞలకన్న స్నిగ్ధతర వస్తు సంఘటనము కార్యసిద్ధికి బ్రహ్మాస్త్రము.

దూదిని గింజలను వేఱుపఱచి దూదిని అదిమి బిగిమూటగా గట్టుయంత్రములు. ప్రత్తిపంటలు ప్రజ్వరిల్లు బొంబాయి , అహమ్మదాబాదు ఇత్యాది ప్రాంతములలో నూఱులకొలదినున్నవి. బరోడా సంస్థానములో నొక యంత్రశాలయైనలేని గొప్పగ్రామములఱుదు.

1904 సంవత్సరములో నీయంత్రశాలలసంఖ్య 895. అందలి పనివాండ్రు 75,500 మంది, ఇవియన్నియు నించుమించుగ స్వదేశజన స్థాపితములు.

జనపనార (జూట్) యంత్రములు

జనపనార ముఖ్యముగా బంగాళాదేశముననగుపంట. గోతములు కుట్టుట మొదలగు కర్మలు యంత్రములచే రచింపబడుచున్నవి. 1828 వ సంవత్సరమున 620 రూపాయల స్వల్పమగుసరకు ఇంగ్లాండునకు బంపిరి. ప్రప్రధమము యంత్రశాల నిర్మింపబడినది 1854 వ సంవత్సరమున.

1892 వ సంవత్సరపు ఆదినివుండిన ఫ్యాక్టొరీలసంఖ్య 26. వీనిలో మొత్తపు మూలధనపరిమితి 137 లక్షల రూపాయలు

1904 వ సంవత్సరాదిని ఫ్యాక్టొరీలసంఖ్య 38 టికిని మూలధనం 748 లక్షలకును ఎక్కెను. ఇందులో నొకవిశేషము. ఆంగ్లేయుల మూలధనము వాయురోగము వచ్చినట్లు పూర్వస్థితిలోనే కదలలేక నిలిచియున్నది. స్వదేశీయులది కపిసైన్యమురీతి గంతులువేయుచు నెగయుచున్నది.

నారనదిమి మూటలుగట్టుయంత్రములు 1904 వ సంవత్సరములో 155 ఉండినవి. వీనిలో పనిజేయువారిసంఖ్య 21,000