పుట:Bhaarata arthashaastramu (1958).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1879 వ సంవత్సరములో 56 ను, 1887 వ సంవత్సరములో 96 యును, 1897 వ సంవత్సరములో 155 ను, 1904 వ సంవత్సరములో 204 ఫ్యాక్టొరీలునుగా వడివడి నీవ్యవహారము వ్యాపించినది. 1904 వ సంవత్సరములో 46,000 మగ్గములు, 52,13,000 వడకు కుదురులుగలిగి యీ యంత్రాళి యమర్పబడి యుండెను. ఈ మొత్తములో బొంబాయికి జేరినవి 84 యంత్రశాలలు, అహమ్మదాబాదునకు 32, తక్కినవి ఇతర సీమలకు.

ఈ మూలధనముయొక్క మదింపు 1,35,00,000 సవరనులు; పనివాండ్రసంక్య 3,50,000; 15 కోట్లరూపాయల దూదిని ఈయంత్రములలో నూలుగుడ్డలుగా దయారుచేసెదరు. అట్లుండియు నింక పదునైదుకోట్లు రూపాయలదూది జర్మనీ మొదలగు నన్యదేశములకు బంపబడుచున్నది. అనగా నింకను 200 యంత్రశాలలకు గావలసిన ముతకదూది పండుచున్నదనుట.

ఇండియాలో 1903-4 వ సంవత్సరములలో తయారైన వస్త్రములకొరత 43,60,00,000 గజములు. ఇదిగాక విదేశనుండి రాబట్ట బడిన బట్టలు 196,60,00,000 గజములు. చూడుడు! ఇంకను ఎంతనేతకు ఈ రాజ్యములోనే ఎడమున్నదో

మొత్తముమీద సాలెవాండ్రకు యంత్రములు ప్రక్కబల్లెము లైనవి. వీరిబ్రదుకు పాడుబ్రదుకయ్యె. అయినను చిత్రపునేత చేతితోనేగాని యంత్రములచేనగు కళగాదుగాన, సరిగెబట్టలు, నేత్రోత్సవములైన కాశీచీరెలు, ధర్మవరముచీరలు ఇట్టివి నేయువారికి యంత్ర నిర్యాతములును మిక్కిలి వెలకుఱుచలును అయినవస్త్రములచే గిరాకి తగ్గినను బ్రతుకు బొత్తిగా నశించలేదు. సాధారణమైన బట్టల నేయువారికి ప్రాణము కంఠగతమైనది. ఈమధ్యమున విదేశవస్తు బహిష్కరణ సమయబద్ధకంకణులైన దేశభక్తుల ప్రచండప్రయత్నముచే వారి కిసుమంత గిరాకిహెచ్చి లాభము గిట్టగలిగినను ఇది తాత్కాలిక విజృంభణమేగాని నిక్కమైన యభివృద్ధిగాదు "ముల్లుదీయుటకు