పుట:Bhaarata arthashaastramu (1958).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చారక్రమంబున ననువయింపబడిన పరిధానములను పూర్వాచార గ్రస్తులే పరిత్యజించునట్లు చేయునంతటి మహాత్మ్యముగల యంత్రములు నిర్వక్రవిక్రమములనుట యతిశయోక్తికాదు. నవీనవిధానముల నల్లబడినవి చూపునకును ముఖ్యముగా క్రయమునందును సరసము లౌటచే నవీనములను నిషేధ్యములను వారుసైతము వీనియందు తగులుగలవారైరి. దేశాభివృద్ధికి యంత్రకళాప్రాబల్యము ఏడుగడ.

మనదేశములోని యంత్రకళల ప్రకృతపుస్థితి

మనవారును ఈ విషయమున నేమఱి యుండలేదు. ఇందునకు దృష్టాంతము.

ప్రత్తి వృత్తి. దూదిగింజలను వేఱుపఱచుట, ఏకుట, వడకుట, నేయుట ఇత్యాదులు. పూర్వము చేతితో నేయబడిన ఢాకా బందరు మల్లులు ఐరోపాలోను సుప్రతీతములై మిక్కిలిగ నెగుమతి జేయ బడుచుండినవిగాని అదిచూచి యోర్వలేక స్వార్థపరులై ఆంగ్లేయులు వానిని ఇంగ్లాండునకు దేగూడదని శాసించుట మొదలగు దుర్మంత్రములచే ద్రుంగుడునొందించి పుణ్యముగట్టుకొనిరి. అదిప్రాతకథ. ప్రకృత వృత్తాంతమునకుం బోదము

బొంబాయిలో ఆవిరిశక్తిచే వడకునేయుయంత్రములు తొలుత ఇంగ్లీషువారిచే స్థాపింపబడియె. అవి జయమునందుట, స్థిరపడుడు, పార్సీలు, మహమ్మదీయులు, మార్వాడీలు మొదలగువారును అందు బ్రవేశింపసాగిరి. నేటికి నందుబ్రయోగింపబడిన మూలధనములో నెక్కువభాగము స్వదేశస్థులకు జేరినదిగాన నిదిభావిశుభసూచకంబని దృఢంబుగ జెప్పవచ్చును.

యంత్రరూపమైన మూలధనప్రవృద్ధి దెలుపుసంగతులు

1851 వ సంవత్సరములో మొదటి యంత్రశాల స్థాపింపబడెను. 1861 వ సంవత్సరములో 12 కర్మశాలల గట్టిరి.