పుట:Bhaarata arthashaastramu (1958).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకపోలేదుగాని అరాజకము, ఉపేక్ష, పూర్వాచారపరాయణత మొదలగు కారణములచే నాకళ ముందునకురాక మొదలంట నశించినది. యూరోపులో నినుమును ఉక్కుగామార్చుటకై ఇటీవలగనిపెట్టబడిన తంత్రములు అగణితశతాబ్దములకుబూర్వమే మనదేశములో బ్రబలి యుండినవి. ఈ జ్ఞాపకములచే నేమిఫలము? వర్తమానమున నించు మించుగ వర్ణనీయ ఖనులన్నియు యూరోపియనుల కధీనములైనవి. వారి వ్యవహారనైపుణియు నుద్యోగాడంబరమునులేకున్న నవి యింకను ముకుళితస్థితిలోనేయుండును.

గనులలో కూలిజేసి బ్రతుకువారిసంఖ్య సుమారు 1,50,000. ఇందులో 90,000 మంది బొగ్గుగనులలోను, 27,000 మంది కోలారు బంగారుగనులలోను పనిజేసెదరు. మైకాలో 9,000 మందియు, మెంగనీసులో 7,000 మంది సరాసరి ప్రతిదినపు గూలివాండ్రు.

మూలధనము

పరిపూర్ణ ప్రయోజనముగా మూలధనంబుం బొనరింపవలయు నన్న అదియెయ్యె. వ్యవహారముల నెంతమట్టునకు గావలయునో యారీతిని కాలవ్రయములేక సమకూర్చు కర్తలుండవలయును. నాగరిక దేశములందు నీవ్యాపారము బ్యాంకీలు, నిధులు ఇత్యాది ఋణవ్యాపార సంఘములచేత నిర్వహింపం బడియెడిని. మిగిలినసొత్తును వితరణతో వాడి వడ్డినందగోరువారు, తమకు గర్మలయొక్క స్థితిగతులు తెలియవుగావున వీనిశోధనయేపనిగాబూని యప్పుసప్పుల వృత్తియే వృత్తిగా నుండు నమ్మకము గలవారియొద్ద తమద్రవ్యము దాపరించి నిర్భయముగ వచ్చినమట్టునకు లాభమనియందురు, కృషి కళాదిక్రియాచతురులు తమకు బుద్ధి యుత్సాహమునుండియు కార్యారంభమునకువలయు మొదలులేకుంట, తదర్థంబు నిధికార్యదర్శుల వద్దకుబోయి, తమ యూహాపోహములదెలిపి, జయమౌననునమ్మిక కలుగ జేసిరేని తగు