పుట:Bhaarata arthashaastramu (1958).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రపుసొమ్ము వడ్డికి గొనజాలుదురు. కావున బ్యాంకీలవలని లాభములు రెండు. చేర్చిపెట్టినవాడు అప్పియ్యగోరిన భద్రమైన స్థానముగా నునికియు, అప్పుదీయగోరిన వ్యవహారదక్షులకు విమర్శించు సహాయ కారియౌ తావుగానుంటయు. ఎక్కువనీరుండు స్థలములనుండి వ్యర్థముగ బోవునంబువుల పదిలపఱిచి నీరుచాలక తపించుచోటులకు ద్రిప్పుటచే కృషి యెట్లు పురణించునో అట్లే బ్యాంకీలచేత సమస్తార్థిక తంత్రములును పెంపుజెందును.

నిధు లుప్పొంగి నెలయుటకు వితరణ, ఉత్సాహము, నాణెమునను ముడుకారణములు. వితరణలేనిది మొదలు ప్రోగుగాదు. ఉత్సాహములేనిది నూతనోద్యమములుండవు. అందుచే దానికి గిరాకి రాదు. నాణ్యెము అనగా యోగ్యత. యోగ్యవ్యవహారములేనిది అడుగువారును నమ్మియిచ్చువారును ఉండరు. ఇది వినిమయకాండంబు నకుంజేరిన విషయంబుగాన నిటసంక్షేపముగ సూచించుటకన్న నెక్కువ వ్రాయజాలము.

యాననాకర్యమువలని ప్రయోజనములు

మూలధనం బుపకరణరూపంబుగను వఱలుట మున్నే వివరింపబడియె. ఈయుపకరణములు రెండువిధములు. వానినిమాత్ర మిట జర్చింతము.

1. యానయంత్రములు:- రాకపోకలు బహుత్వరితముగ జరుగకున్న వాణిజ్యము వ్యాప్తంబుగాదు. కాలినడకదప్ప నితరవిధగతు లెఱుంగనికాలమున తమగ్రామమునకుమించి సంబంధములు పెట్టుకొనుట కష్టసాధ్యము. ఎద్దులబండ్లచే వ్యవహారవైశాల్యము కొంత హెచ్చును. గుఱ్ఱముల వశీకృతములం జేసినదాన నింకను విస్తరించె. కొన్నిపల్లెలుమాత్రము దిరుగువారు తాలూకాలును ఒకప్రమాదముగా గణింపరైరి. నేడన్ననో ధూమశకటములును ఆవిరిశక్తిచే నిచ్చవచ్చి