పుట:Bhaarata arthashaastramu (1958).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గనులు

పంటలకు దరువాత ఖనిజములు ప్రశస్తములు. ఇందును ఉత్పత్తి నానాటికి నెదుగుచున్నది. 1898 వ సంవత్సరములో త్రవ్వబడిన ఖనిజముల రమారమి మదింపు 525 లక్షలరూపాయలు. అదే అయిదేడుల కంతయు అనగా 1903 వ సంవత్సరములో 750 లక్షలకు వచ్చినది. అనగా నూటికి 44 పాళ్ళు వృద్ధియనుట.

(బర్మాతోజేరి) మనదేశములోని ఖనిజముల వివరము:-

1. బంగారు రమారమి వార్షికోత్పత్తి మదింపు 1904719 సవరనులు
2. సీమబొగ్గు రమారమి వార్షికోత్పత్తి మదింపు 1225677 సవరనులు
3. ఉప్పు రమారమి వార్షికోత్పత్తి మదింపు 347897 సవరనులు
4. సురేకారము రమారమి వార్షికోత్పత్తి మదింపు 262603 సవరనులు
5. కిరోసిన్‌నూనె రమారమి వార్షికోత్పత్తి మదింపు 165810 సవరనులు
6. రత్నములు రమారమి వార్షికోత్పత్తి మదింపు 39345 సవరనులు
7. మైకా (అభ్రకము) రమారమి వార్షికోత్పత్తి మదింపు 80120 సవరనులు
8. మెంగసీసు రమారమి వార్షికోత్పత్తి మదింపు 79443 సవరనులు
9. ఇనుము రమారమి వార్షికోత్పత్తి మదింపు 13584 సవరనులు
10. పెన్‌సలుసీసము రమారమి వార్షికోత్పత్తి మదింపు 11931 సవరనులు
11. తగరము రమారమి వార్షికోత్పత్తి మదింపు 6875 సవరనులు
12. తృణమణి (ఆంబర్) రమారమి వార్షికోత్పత్తి మదింపు 362 సవరనులు

ఇత్యాదులు.

ప్రకృతము మనరైల్వేలలో వినియోగింపబడు బొగ్గులలో ముక్కాలు మువ్వీసమునకన్న నెక్కువ స్వదేశోద్భవము. ఈ బొగ్గుయొక్క యుత్తమములైన ఖనులు బంగాళాలోను నిజాము సంస్థానములోనువున్నవి. బంగారునకు ముఖ్యస్థానము మైసూరురాజ్యమునకుం జేరిన 'కోలారు.' పూర్వము హిందువులు థార్వాడప్రాంతములను గోలకొండ సమీపమునను 500 అడుగుల కన్న నింకను లోతైన గనులనుదించిరనుటకు శిథిలములైన వానిజాడల నేటికిని సాక్ష్యమొసగు చున్నవి. అయ్యో! స్వర్ణగ్రహణాదులయందు ప్రాచీనులకు గుశలత