పుట:Bhaarata arthashaastramu (1958).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాప్తికిదెచ్చి, పిమ్మట దూరపుంబనియైన పరలోక విజయమున కారంభింతమని, లౌకికాచార పరాయణులై రాజిల్లెదరు.

ఇట్లు హిందువులయొక్కయు ఐరోపావారియొక్కయు నాగరికతలలోగల ముఖ్యభేదములు సూచింపబడినవి. ఏలయనగా పురుషోద్యోగస్వభావము, అది యనుసరించి మార్గములు, పద్ధతులు, అర్థముల గౌరవలాఘవములు, వీనికన్నింటికిని సకలకర్మలకును మనుష్యుల హృదయముల దృడముగ నావేశించి యావజ్జీవమునునడిపి నిర్ణయించు నమ్మికలే జన్మస్థానములని తెల్పుటకు.

అజ్ఞానము జీర్ణించుకొలది పూజాపునస్కారములు సన్నగిల్లు ననుటకు మనవారి యాచారములే ప్రబలప్రమాణములు. ఎట్లన, అడవి మనుష్యులు ఱాలుఱప్పలు మొదలుగజూచిన వానినెల్ల గొలుతురు. ఏదైన వృక్షము వాయువశంబున దలయూచెనేని, అందేదో దేవత యావేశించియున్నదని, మాలలు దానిని చింపిఱిబట్టలతో నలంకరించి ప్రదక్షిణములుచేసి యానందతాండవ మాడుదురు. శూద్రు లింత మూఢులు గాకున్నను కాటేరి, మాటేరి, మారెమ్మ, పోతమ్మ ఇత్యాది క్షుద్రదేవతల నాశ్రయింతురు. వీరికన్న జ్ఞానమాన్యులైన బ్రాహ్మణులు వీనిని తుచ్ఛములనియు తమోగుణ ప్రధానములనియు నిరసించి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇత్యాది శ్రేస్కర ప్రకాశమానములైన ప్రకృతులదేవతలని భజింతురు ఇందుచేగలుగు లాభము సూర్యనమస్కారములకును యజ్ఞములకును వరుణ జపములకును అగుసెలవేగాని వేఱొండులేదు. వేదకోవిదులు వీనిని ఉత్సర్జించి సర్వాంతరామియైన పరమాత్మ నారాధించుటమాత్రము నిహితమని యనుష్ఠింతురు కావున విజ్ఞానము వికసితమగుడు భక్త్యర్హములని భావింపబడువానిలెక్క తక్కువయగుననుట ప్రవ్యక్తంబు.

ఐరోపాలో పూర్వమునుండి సూర్యచంద్రులకు సంభావన పూజ్యము. ప్రకృతము సత్యాసత్య విచక్షణులు లోకభజనమే పరంబు