పుట:Bhaarata arthashaastramu (1958).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు రాజమార్గంబని ప్రకటించెదరు. ఎట్లన భగవంతుడు ధర్మమున కతీతుడైనచో బ్రార్థించినను ప్రసన్నుడౌననుట నిశ్చయములేదు. ధర్మబద్ధుడైనచో సన్మార్గగాములకు సద్గతివొసగవలయుట విధియౌను. అర్చనలచే నారాదితుండౌనను సిద్ధాంతమున కుత్పాదకములు రాజులవల్ల - బ్రజలుపడిన యుత్పాతములే. మహారాజులు, నవాబులు, పాదుషాలు మొదలగు ప్రజాపీడకులు చట్టదిట్టములకు మించినవారమని స్వేచ్ఛావిహారులగుడు. బాధల దొలగించుకొనుటకు, మన్ననలు వడయుటకును, అందఱు చేతులుగట్టుకొని వారిస్తోత్ర పారంబుల వల్లించుటవినా వేఱొండుపాయములేనివారైరి. అదిచూచి "ఒకచిన్నరాజే యిట్లు నిరంకుశ ప్రతాపుడైనపుడు సర్వశక్తిమంతుడగు భగవంతుడింకను ఉద్దండుడై యుండుగదా! ఇక నాతని సమ్ముఖమున న్యాయాన్యాయంబులు గుణదోషములును నివేదించి ఫలమేమి? వందిబృందముల చందంబున స్తుతించి "స్వామీ! నేను పాపిని ద్రోహిని. ఉప్పురాతికైన బనికిరాను. మీకరుణయే వేచియున్నాడ. రక్షింపు మహాప్రభో!" యని అతని చరణారవిందముల పిఱికిపట్టుబట్టి వదల ననిన లబ్ధసాయుజ్యులమౌదుము అని లోకులు యోచించిరికాబోలు! వర్తమానకాలమున రాజులు సర్వస్వతంత్రులనియు, శాసనబద్ధులు గారనియు నెవ్వరు నొప్పుకొనరుగాన, పాదుషాల ప్రతిబింబమో యనునట్టి కృతిమదేవుని గొలుచుటమాని ధర్మోద్ధరణ లీలాలలితంబైన సత్వగుణ బ్రహ్మంబు నుపాసించుట కర్తవ్యంబు ఈ బ్రహ్మోపాసనమునకును లౌకికాచారమునకును విరోధములేదు. మఱియు నిహమే పరసాధనమని యెన్నవలయు.

      ను. "తనకున్ మించగరానిధర్మమున బద్దంబై వియోగంబు గా
           నని ద్వంద్వంబులు పుట్టుగర్భమయి తన్మార్గంబునన్ సృష్టిని
           ల్పునమోఘంబగు తత్త్వముందలచి యాలోచించి యశ్రాంతమున్
           ఘనసమ్మోదమునందు ధీరుల నఖండజ్ఞానులం గొల్చెదన్."

కావున సంఘసంయోగమునకు నౌకాదిగమనములకును బ్రతిరోధకంబులైన యాచారములచే నావరింపబడినవారు, పూర్వము వ్యవసాయకు