పుట:Bhaarata arthashaastramu (1958).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈప్సితంబులెల్ల నీడేర్చులోకమొండు గల్పించికొని "మేఘముల నీళ్ళునమ్మి దొన్నిలోని నీళ్ళు దొర్లించినట్లు" ప్రవృత్తివదలి నివృత్తి నవలబించుచున్నారు. "భూలోకంబున నెన్నియో కష్టములు బడవలసినవారమై యున్నాముగదా? దీనికి నష్టముగట్టియిచ్చు లోకం బొకటిలేకున్న ధర్మమెట్లు స్ఫుటంబౌను?" ఇత్యాది యోచనలచే జనుండు భ్రమమూలమై పరిపూర్ణ సుఖాభిలాషయొక్క ప్రతిబింబమైన అవ్యయ పదవియొకటిగల్పించి బొమ్మలిండ్లాడు బాలికలంబలె కుతుకంబునొందెడు. అది యట్లుండె

ఆదిని ప్రకృతిలోని వస్తువుల దేవతలని పూజించుటకును, విరక్తియందు రక్తిగొనుటకును అరయమి, వెఱపు, నైసర్గికములం జయించి పనులు జేయించుకొనదగు జ్ఞానస్ఫూర్తి లేకపోవుటయు గారణములు. మనము ప్రకృతుల కధీనులమైయుంటిమి కావున బూజించితిమి.

ఇపు డట్లుగాదు. మనుష్యతేజం బజేయంబై యున్నది. ప్రకృతి మనకు బ్రజయయ్యె. మనము పతులమైతిమి. అమెరికాలో 'కాలిఫోర్నియా' యనుసీమలో నొక మహానదిని ఇంకొకప్రక్కగా బ్రవహించునట్లు బంధించిరి. నదులు సముద్రములును పొంగుకాలమును పరిమితినిగణించి యుచితప్రతిక్రియలను మున్నుగనే సిద్ధపఱిచి వానిచే నగు నుపద్రవముల నానాటికి దగ్గునట్లు చేయుచున్నారు. మారుతములు ప్రవాహములు మున్నగువానిని గొప్పచక్రములు ద్రిప్పునట్లు చేసి నూడిగములకు గుదిరించుచున్నారు. ఇట్లనేకరీతుల బురుషుడు విజృంభించి యేపుజూపి ప్రకృతిగర్వము నణంచుట సర్వజనవేద్యంబు. అరయమితోద భయమును భయముతోడ బూజయును గ్రమముగ వదలుచున్నవి. ఈ లోకముననే, మనకుగాకున్న సంఘమువారికిని, నేడుగాకున్న ఇక ముందైనను, సాధ్యసుఖములన్నియు సమకూరునను నుత్సాహ మున్నది. కాన యూరోపియనులు తొల్తనీపని