పుట:Bhaarata arthashaastramu (1958).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలనందున వెఱపుగొని, దేవతలని పూజింపదొడగిరి. గూఢమైన వానినిజూచి భయముగొనుట మనకు సహజము. కావుననే పసిపిల్లలు చీకటిగదిలో నొంటిగానుండరు. అది మన్వంతరములవారునిట్లే. కిరాతులవంటివారు జ్ఞానమాసున్నా! స్వభావాద్భుతములజూచి తమకు విదితములుగానందున అవాఙ్మనస గోచరంబులని సాష్టాంగదండ ప్రణామంబులకు మొదలిడిరి. చూడుడీ ఈవింత! అవాఙ్మనస గోచరత నిజమేని పూజచేసిన మేలుచేయుననుట గోచరమౌటెట్లు? "దేవుని గుఱించి మనకేమియు దెలియదు. అత డింద్రియాతీతుడు" అని చెప్పుట. వెంటనే "అతడు భక్తునికి దాసానుదాసుడు" అని సిద్ధాంతముజేయుట! ఏమియునేరనివా రీవిషయమెట్లునేర్చిరో తెలియరాకున్నది. యధార్థ్యమేమన్న:- మనుష్యుడు తనకు గీడుచేయ శక్తిగలవానివి గోప్యవస్తువులను బహుగౌరవబుద్ధితో జూచుట నైజగుణం. కుఱ్ఱవానిని చేరదీసి యొకచేతిలో నరణానుంచి యింకొకచేతిలో నేమియులేకున్నను గట్టిగా మూసికొని "నీకీచేతిలోనుండునది గావలయునా!" అని యడిగిన నాబాలుడరణాతీసికొనుటకు జంకుచుండును. అనుభవవంతులమైన మనము ఆ యరణాను లాగుకొని "నీరహస్యము నీయొద్దనే భద్రముగనుండనీ" యని నవ్వుచువెళ్ళుదుము. అధ్యాత్మిక విషయములో నేటికిని జనులు బాల్యమునుమానుకొన్నారు. అనేకులు ఎదురునుండు ప్రపంచమునకన్న నెక్కడను గనబడని స్వర్గమే మేలని నమ్మియుంటకీ బాల్యచాపల్యమే కారణము. మఱియు నీలోకము సత్తుగాన నిచ్చవచ్చినట్లున్నదని భావించుటకుగాదు. "నాయిల్లు బంగారముతో గట్టినది. నేనెప్పుడు నిట్లే కౌమారదశలోనే యుందు" నని డంబములు పల్కువానిని పిచ్చియాసుపత్రికి బంపుదుము. కాని ఋషీశ్వరుండనిభావించి పూజింపము. ఇంద్రియములకును బుద్ధికి నతీతమైనదానిని అభిమతానుసారముగా చిత్రించుకొని కృత్రిమ సంతుష్టి వడయవచ్చును. కావుననే సాధ్యాసాధ్య విచారణలేక యనేకులు