పుట:Bhaarata arthashaastramu (1958).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. ఇండియాదేశములో వస్తువు లఖండ పరిపూర్ణములై యున్నవి. గంగాప్రముఖ నదులు, సారము తోరమైన శాలిక్షేత్ర సముదాయము. సాంద్రములైన మహారణ్యములు మనకున్నట్లు ఇంగ్లీషువారికిలేవు. అందుచేతనే మనము వారికైన ధనాఢ్యులమని వాదింప బిచ్చివాడైన నుదిలగొనడు వస్తువులున్నను ఫలములు యధాక్రమములుగావు. ఏలన వస్తువుల సఫలంబులజేయు శక్తిలేమికతన.

2. మఱియు వస్తువుల విలువ యాదాయము ననుసరించి యుండును. గొడ్డుభూముల విస్తీర్ణత యెంతయుండిననేమి? అమ్మువారుందురుగాని కొనువారుండరు. క్రొవ్విన నేల యొకకాణియున్నను కన్నుమూసికొని విక్రయించినను వేయిరూపాయలు వెల రూడి. ఈ యంతరువునకు గారణ మాదాయమని వేఱ చెప్పవలయునా?

గోదావరినది పూర్వము యధేచ్చగా బ్రవాహముపాఱి సముద్రునితో దానాతురమున బోయి చేరుటయకాదు. త్రోవలోని పంటలసైత మాక్రమించి యతనికి గానుకగా గొని పోవుచుండెను. ఇపుడు ఆనకట్టలు, వంతెనలు మొదలగువానిచే నిరోధింపబడి యత్యధిక ప్రయోజనకారిణియాయె కావున వస్తువుల యుపయుక్తత వేదములట్లు అపౌరుషేయముగాదు. మఱి పౌరుషాను క్రాంతమే. అట్లుండ వస్తురాసులమాత్రము జమచేర్చుటచే దేశశ్రేయంబు నుర్ధారితంబుగాదు. మూలమునకైన ఫలము ముఖ్యము. ద్రవ్యసంచయములకన్న దజ్జనితోత్పత్తి సుభావ్యము.

3. మఱియు ఫలితముయొక్కయు మాత్రుభూమియొక్కయు వెలలు యధాక్రమములు గావు. తంజావూరి జిల్లాలోనివియు మైసూరు సంస్థానములోనివియు వడ్లు చెన్నపురిలో నమ్మిన వెల యొక్కటే. రాకపోకల సౌలభ్యముచేత తుదకు దంజావూరిలోని వెలలు సైతము మైసూరు వెలలకన్న నధికములుగావు. అట్లుండియు దంజావూరిలో నేలలు మైసూరిలోని చిత్రదుర్గ ప్రాంతము నేలలకన్న ముప్పది నలువదిరెట్లు ప్రియములు. కావున మూలార్థములయొక్క ధనమూల్యముంబట్టి ప్రాభవము మతింపజూచుట పొరపాటు. అది యెక్కువగ నుండిన మాత్రన రాజ్యమునకు భూరికల్యాణము రాబోదు.

4. ఇంకను నొకవిశేషము. మొత్తపు టాదాయము గొలుచుటయు నాభాసమ జనసంఖ్య గణించి ప్రతిమనుజుని యాదాయ మింతయని నిర్ణయించి సరాసరి చూచినంగాని నిజమేర్పడదు.

ఉదా. హిందూదేశముయొక్క జనసంఖ్య దాదాపు 30 కోట్లు. ప్రతివానికిని వత్సరమునకు రెండురూపాయలు ప్రాప్తించినను సాంవత్సరి కాదాయము 60 కోట్లగును. ఇంగ్లాండులోని జనసంఖ్య సుమారు 4 కోట్లు. దానిలోనొక్కొక్కరికి 15 రూపాయ లాదాయమున్నను దేశీయ వత్సరాదాయము 60 కోట్లే అందుచేత మనము వారును తుల్యులమని ఎంచుట యర్హమా? పరిశీలించిన వారిలో నేడవపాలు భాగ్యమైనను మనకు లేదనవలయును:

కావున దేశసంపదలబోల్చి తారతమ్యము నిరూపింపగోరిన సరాసరి పరిమాణముల నిర్ణయించుటయ యకుంరిత పద్ధతి.