పుట:Bhaarata arthashaastramu (1958).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికపాఠము

మూలధనము

ముఖ్యలక్షణములు:-

1. ఉత్పాదనశక్తి. 2. భావిఫలదత్వము. పద్య:కాల సుఖమునకన్న నుత్తరకాలసుఖము ప్రథానమనియెంచు ప్రాజ్ఞత మూలధనావ్యాప్తికి బీజకారణము.

ఉత్పాదకశక్తి మూలధన ప్రవృద్ధికి గారణము. అనగా మూలధనము లాభదాయి గావున దానినెల్లరు ప్రోగుచేయుదురనుట.

ఉత్తరకాలమున ఫలమునకు వచ్చునది గావున నంతలోనే ఏ విఘ్నములువచ్చునో, యేదోషమువచ్చి తన్ను కొనిపోవునో అట్లయిన చిలుక బూరుగంరానిపండు నాసించినట్లగుగాదాయను శంకయు భయమును నెల్లరకు సహజములు. అవి మూలధనవృద్ధికి నిరోధ కారణములు. నష్టము వచ్చునను భయమునకన్న లాభోత్సాహముమీఱి మెఱయుదేశములలో పరిపణము లపారములగును.

అర్ధము, మూలార్థము వీనికింగల వ్యత్యాసము

1. సంఘపరముగా జూచిన:-

ఆదాయమునొసగు పౌరుషేయ పదార్థములన్నియు మూలార్థములు. స్వభావసిద్ధములు. ప్రకృతికిం జేరిన యుత్పత్త్యాధారములుగాన నిందులో లెక్కకురావయ్యె.

2. సాంఘికుల పరముగా జూచిన:-

అనగా ప్రతిపురుషునియొక్కయు పక్షముగా జూచిన ననియర్థము. తాము డబ్బిచ్చి కొన్నవగుట నేలలు మొదలగు నిసర్గజ పదార్థ సంచయంబులుసైతము వారికి మూలధనములే.

అట్లయిన నర్థములకును మూలార్థములకునుగల భేదమేమి?

స్థిరతములు నుత్తరకాలికములునైన యర్థముల ప్రాప్తికై ప్రయోగింపబడు నర్ధము మూలార్థము. అయ్యదియ తాత్కాలిక వినియోగార్హముగ భావింపబడిన సాధారణార్ధము. వీని యందు వస్తువుంబట్టి భేదముపుట్టలేదు. మఱి యీ తారతమ్యంబు ప్రయోజనసిద్ధంబు.

ఆదాయము ద్వివిధము మొత్తము శిష్టము (నికరము) అని. సెలవులుపోగా మిగిలిన రాబడి శిష్టమనబడు.

దేశాభ్యుదయము గొలుచుపద్ధతి:-

ఇది యెంతయు ముఖ్యమైన విషయము, వస్తురాసులంబట్టి కొల్చుట సరియా? ఆదాయముంబట్టి కొలుచుట సరియా? ఈ యంశము విచార్యము. ఆదాయముంబట్టి గణించుటయ యుక్తమని శాస్త్రజ్ఞుల మతము. ఎందులకన:-