పుట:Bhaarata arthashaastramu (1958).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదమూఁడవ ప్రకరణము

ఆర్ధికయుగములు - మృగయా యుగము

యుగములక్రిందట పురాతనకాలములో జనులు అసంఖ్యులు ననాగరికులును గాన దట్టముగనున్న వనములలో వేటాడియు ఫలమూల శాకాదులగోసికొనియు గాలయాత్ర దీర్చుకొనిరి. వీరిబ్రతుకు మనుష్యులబ్రతుకాయని సంశయింపవలసి యున్నది కట్టుటకు గుడ్డలును వసింప బర్ణశాలలైననులేక కుడువను ద్రావను నేమైన దొరికినజాలునని వానరములట్లు మేతకై కాట్లాడుచు పరిభ్రమించుచుండిన మన పూర్వులందలచిన మనం వారిసంతతివారమాయని యచ్చెరువయ్యెడి.

ఈలాగు స్వచ్ఛందముగనుదయించు కూరాకులతో నెన్నియో శతసంవత్సరంబులుగడుచుడు. "జంతువుల సాధుచేసి పదిలపఱచిన వలసినపుడు వలసినంత యాహారము లభించు" ననెడు బుద్ధిగలవారు కొందఱు ఆరీతిచేసి "ఇది ప్రాచీనాచారముగా" దను మతిచే నట్లు చేయక హీనబలులైన సమానకా లీనుల నుక్కడించి తమకు బానిసలం జేసియు యమలోక ప్రయాణము జేయించియు సర్వము నాక్రమించు కొనిరి. మృగయులుగ నుండుటమాని పశుపతులైరి. ఆ తొల్లిటి బోయల రక్తమింకను మనదేహమ్ముల నంటియుంటగాబోలు మృగయాభిరక్తి ఇంకను మృగ్యంబుగాలేదు. భిల్లులుగనుంటమాని పిదప గొల్లలమైతిమి.

పాశుపాల్యయుగము

ఆకాలమున మానవులకు మందలే సంపదలు. పశువులు, మేకలు, ఎనుములు ఇత్యాది జంతువుల పాలు, పెఱుగు, వెన్న, మాంసము వీనితో జీవనము గడుపుకొని పచ్చిక ఆకులు బలసినచోటులకు మందల నడపించుచు చర్మములతో పరిధానముల గల్పించుకొని