పుట:Bhaarata arthashaastramu (1958).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది ఇరువదియైదేండ్లకు యంత్రముల మార్తురు ఇంగ్లాండులో యంత్రసముదాయముయొక్క ఆయు:ప్రమాణంబు సుమారు ముప్పది లేక ముప్పదియైదు వత్సరములు. జపాన్, జర్మనీ, ప్రాన్‌స్ ఈదేశములలో నలువదియేడులవఱకును ఉండనిత్తురు. మనదేశముననన్ననో తెగువ పూజ్యముగాన ఆ యంత్రమే తనంతట జీర్ణమై కృశించి ఇక నొక యడుగైన నెత్తివెట్టజాలునని నాలుకచాచుకొని తునకలై క్రిందపడినను చెన్నపట్టణపు జట్కాగుఱ్ఱములమాడ్కి అవసానకాల పర్యంతమును పనిజేయించుకొందురు.

4. యంత్రము లూరకున్న నష్టముగాన వెలలు అనుకూలమైననుసరే ప్రతికూలములైననుసరే సరకులుదెచ్చి పనిజేయుచుండుటయే విధానము. దీనిచే ధరలు చంచలములౌను. అదెట్లన గిరాకి మందముగానున్నను ఉత్పత్తితగ్గదు. ఉత్పత్తియైన సరకులను కర్మశాలలోనే యుంచుకొనియుండుటకును గాదు. కావున నెట్లైన నమ్ముడు బోవలసినదేయని అడిగినవెల కిచ్చివేయుదురు. ఉన్నట్టుండి వెలలు తగ్గును. అందుచేత పోటీవారు కొందఱు దివాలెత్తి నెత్తినగుడ్డవేసికొని రామేశ్వరయాత్ర బోవలసివచ్చినను వచ్చును. సహకర్ముల సంఖ్య కొద్దియౌకొలది ఉత్పత్తియు నల్పమౌను. గిరాకి రుచిమరిగినదగుటచేత ఇంకను గావలయునని యాసించును. అపు డున్నట్టుండి వెలలు హెచ్చును. ఈ రీతిని యంత్రకళాబంధురములైన దేశములలో వెల లుయ్యాల లూగుచుండును.

5. ఇంగ్లాడులో తొలుత రైల్వేలువేసినప్పుడు జనులసంఖ్యులు లాభార్థులై కంపెనీలలో భాగములుకొనిరి. రైల్వే కొంచెపుగాలంలో బదులిచ్చునట్టిదిగాదు ఇనుపదారి చెదరకుండ మట్టి సమముగవేయుట ఒకటి; గమనశక్తిగల యంత్రముల గుదుర్చుట రెండు, లోకులు "ఇవి యుత్పాతకములుగావు వీనిలో సామానులు బంపవచ్చును. మనమును గూర్చొనవచ్చును" అని నమ్మకముగొనుట మూడు,