పుట:Bhaarata arthashaastramu (1958).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. ఉపకరణము లెంత దృఢంబులు శాశ్వతంబులునో వానిని సృష్టించుటకు యధాక్రమముగ నంతకుదగినకాలముపట్టును. ఐరోపా, ఇండియా దేశములకు నౌకాయాత్రలు సులభముగా జరుగుట కొఱకు 'సూయజ్‌' అనుచోట సముద్రములకు సంధి యేర్పడుటకై నావలు నిరాఘాటముగ బోగలిగినంత గంభీరమును లోతు వెడల్పుగలదియునైన కాలువను ద్రవ్విరి. ప్రకృతము 'పసిఫిక్‌', 'అట్లాంటిక్‌' మహాసముద్రములు సంగమించి వాణిజ్యము నిరాటంకముగ జరుగుటకై 'పనామా' యను నమెరికా ఖండములోని సీమలో సూయజునకన్న మించిన కాలువను ద్రవ్వుచున్నారు. ఇట్టి ధ్రువములైన సాధనములు సమకూరుటకు పదిపదునైదు వత్సరములు పట్టును. అంతవరకు భరణాదులకు పూర్వార్జిత నిధు లుండవలయును. ఇవి పేదలచే సాధ్యములకు కార్యములుగావు.

అయినను ప్రతివాడును గుబేరుడు గాకున్నను అందఱునుచేరి కొంతకొంత చందావేసి సంఘముగకుదిరి పనిజేసిన ఎట్టి యసాధ్య కార్యములనైన సాధించుట యొక ప్రమాదంబుగాదు.

2. అచలపదార్థము లనేకవత్సరములు స్థిరములుగా నుండుగాన భావిని వ్యవహార స్థితిగతు లెట్లుండునను దూరదృష్టియు, ఎక్కినను దగ్గినను సమాళించుకొందమను ధైర్యమునులేనిది వానినెవరును తఱుచు నిర్మింపబూనరు.

3. అతిధ్రువమగుటయు గీడే. ఏలయన లోకమున నెందఱో క్రొత్తక్రొత్త సాధనములం గనిపెట్టు చుందురుగాన విశేష నష్టము లేకయే అమ్మియో తీసివేసియో నూతనయంత్రముల స్థాపించుచుండ వలయును. "ఒకయంత్రమున్నదిగదా, ఇక దీనికి మించినదేమి యుండును?" అని పరామరికతో నుండిన పోటీచేయువా రింకను శీఘ్రగతినో నిపుణతతోనో పనిచేయు యంత్రముల గనిపెట్టి యుపయోగించి ఇంకను నయముగనమ్మి దివాలెత్తజేయుదురు. అమెరికాలో