పుట:Bhaarata arthashaastramu (1958).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు ఒక యణానైన జేర్పజాలరు. లక్షాధికారులు నూఱులకొలది మూటలుగట్టుదురు. అనగా నీరాసులలో అధికవృద్ధిన్యాయము చెల్లుచున్నదనుట. కావుననే యొక్కతూరి ముందునకు వచ్చినవారు సరసరమని బహుత్వరలో బైనికెక్కుటయు వెనుకబడినవారు వారలం జేరజాలక ఇంకను అథ:పతితులై పరితపించుటయు నగుచుండుట. ఐరోపా ఖండము మిగుల జిన్నదియయ్యు దానికన్న నెన్నియోమడుంగులు విస్తీర్ణతనుదాల్చిన ఆసియాఖండమును వెలకుగొనునంత లక్ష్మీయుతంబై యుండుటకును, మనము వెనుకంజిక్కి దౌర్భాగ్య చక్రవర్తులుగ నుండుటకును ఇదియే మూలంబు. మనము ఒకింత సేకరించు లోపలవారు పదింతలుగను రెండింతలు సేకరించులోపల వారు ముప్పదింతలును జేర్చిపెట్టుచు నానాటికి మనకును వారికింగల యంతరమును నిడివిజేయు చున్నారేగాని కుఱుచగానిచ్చునట్లుగానము. ఇప్పుడు పదేడులలో మనదేశమునందు సుమారు 10 కోట్లు ప్రయోగింపబడియె. ఇంగ్లాండులో దూదిసరకుల వ్యాపారమునకు ముఖ్యస్థానమైన మాన్‌చెస్టర్ అను నొక పట్టణమునందే ఇంతకన్న ద్విగుణరాశి నుపయోగించిరి. ఐరోపావారితో సమానపదవి బడయవలయునన్న వారికన్న మన మెన్నియోతరము లెక్కువగ బాటుపడవలయు.

మూలధనోత్పత్తి

ఏకారణముచేతనైన ఫలాతిశయము ప్రాప్తింపుడు మితంబుగ భోగించి మిగతదానిని సెలవుజేయక పునరుత్పత్తికై ఉంచుటచే మూలధనము సిద్ధించును. చేతులతో గువ్వలబట్టి జీవించువా డొక డుండెననుకొందము. వాని కొకనాడు పక్షుల మితముగజిక్కిన కొన్నింటిని భుజించి తక్కినవానితో వేటకు సాధనములైన విల్లును అమ్మును గొనిననుసరే. లేదా మఱునాడు భుక్తికి దక్కువలేనందున పక్షుల వెదకుటమాని విల్లు నమ్ములను రచియించిననుసరే పుంజ మేర్పడు. ఈ గుణంబునకు వితరణమనిపేరు. వితరణమన దానుదినక