పుట:Bhaarata arthashaastramu (1958).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము

మూలధనము అనగా పుంజీ

           "మూలకరి పుష్పములు గోయు మాడ్కి తేటి
            పువ్వు దేనియగ్రోలెడు పోల్కి (మొదలు)
            గందకుండంగ గొనునది కార్యఫలము
            బొగ్గులకు బోలె మొదలంట బొడవరాదు." - భారతము

నిర్వచనము

ప్రకృతి పౌరుషములవలె ఆద్యంబుగాకున్నను అర్థబాహుళ్యమునకు మూలధనం బతిముఖ్యంబైన కారణంబు గావున దీనిని కొందఱు మూలాధార తుల్యమనియండ్రు. అయినను స్వభావమునకును బురుషునకును దరువాతిదనియు ఫలస్వరూప మైనదనియు తెలియుట సుగమమే. సాధారణములగు ఫలంబులకన్న నిద్దానికిగల ఋజుగుణంబేమన్న ఫలములపుడే వినియోగమునకు దేబడి నశించును. మూలధనమన్ననో ఇతర ఫలప్రాప్తికి నుపకరణముగ బ్రయోగింపబడును. నేరుగ ననుభవమునకు దేబడక సుఖములగు ఫలములను గడించుటయందు ప్రయోగింపబడు వస్తు సమూహంబు మూలధనంబు నాబడు.

మృగములు కష్టమున జీవించునవిగాని యురువులం బ్రోగుచేసి తద్ద్వారా మఱింత సంపాదించు నేర్పుగలయవికావు. పశుప్రాయులైన వారును మెకంబులట్లు అయ్యైదినముల చింతదప్ప ముందునాళ్ళ గూర్చి యోచింపరు. నాగరికతతో భావిప్రజ్ఞయు బరిణతిగనును.

తొలుదొల్త మూలధనముం గూడబెట్టుట కష్టసాధ్యముగాని సులభముగాదు. తమయొక్కయు దమవారియొక్కయు బోషణమునకు పోగా ప్రాప్తవిత్తములలో బీదలకేమి మిగులగలదు? ఒక్కతూరి యేతీరుననో మిగిల్చికొన్నయెడల దరువాత మిగులబెట్టుట కష్టము గాదు. మిగుల మిగుల మిగిలించుట సులభము. కూలివాండ్రు దినము