పుట:Bhaarata arthashaastramu (1958).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొకరికినిబెట్టక భూమిపాలు చేయుటగాదు. సమయాసమయములం బాటించి ఇంకను గూర్ప నుద్యమించుట.

మూలార్థసిద్ధికి హేతువులైన ధర్మగుణంబులు

వితరణమునకు సహాయభూతంబులైన గుణంబు లెవ్వియన:- 1. దీర్ఘదర్శిత్వము. ఇయ్యది నాగరికాగ్రేసరులయెడ సహజమైయుండు. తక్కిన మనవంటివారి కనవరతానుష్ఠానముచేతగాని యలవడదు. రాబోవు కాలమునకువలయు సాధనముల నిప్పటినుండి సిద్ధపఱుపం గోరుట మంచిదియని యోచించినమాత్రాన లాభంబులేదు. ఎఱుకతో నడకయు నుండవలయు. ఎఱిగినంతన నడత తనంతట కుదురుననుట యసత్యము. ధైర్యమునుగూర్చి వ్యాఖ్యానముచేయ నందఱును సమర్థులేకాని పిఱికితనములేనివారు కొందఱే. ప్రవర్తనము గరిష్ఠత నొందవలయునన్న క్రమము దప్పక సాధించుటయే సాధనము. వేఱొండులేదు. కొందఱు జనుల విద్యావంతుల జేసినజాలును. సన్మార్గావలంబనంబు విధిలేక తనంతట అనుగమించును అని భావించెదరు. ఇది వెఱ్ఱితలంపు. ఇది నిక్కమేయైన ఇప్పటికాలపు బి.ఏ. ఎం. ఏలు బయట నొకమాటయు నింట వేఱొకమాటయుగా ద్విజిహ్వులై యేలయున్నారు? కావున నభ్యాసమే అన్నింటికిని శ్రేష్ఠంబు.

2. సాహసము. అనగా ఫలసిద్ధి నిశ్చయముగాదు. కావున మొదలు మునిగినను మునుగనీ యనుధైర్యము. ఐరోపావారి సాహస మేమనవచ్చును! బలాఢ్యులై చెలగుటకు బూర్వమే ఇండియా, చీనా, జపాన్ మున్నగు పరరాజ్యములలో వాణిజ్యార్థము ప్రవేశింప బూనిరి. తేజోనిధులకు కారాకాల నిర్ణయ మున్నట్టు కానము.

3. సంఘక్షేమమే పరమధర్మమని భావించుట. తమమేలే చూచుకొనువారు ఎన్నటికోగాని సిద్ధిజెందని వ్యవహారముల కాయత్తులుగారు. తత్కాల ఫలప్రదములకుమాత్ర మాసింతురు. సంఘము