పుట:Bhaarata arthashaastramu (1958).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్టి స్వర్గములో నెందఱు దేవతలు బ్రతిమాలుకొన్నను వీరిపొత్తున మానముగలవా డెవ్వడును సహవాసముజేయ సమ్మతింపడు. ఆ స్వర్గమును మనదేశ మట్లేయుండునేమో! ఏమీ! హిందూమహా జనుల బట్టిన మౌఢ్యము. శ్రీకృష్ణులు బొధించినది ఫలాపేక్షలేనిపని. వారి శాస్త్రముద్ధరింప నవతారమెత్తిన యుత్తమవర్ణు లాచరణమున బ్రకటించునది పనిలేని ఫలాపేక్ష. ఇయ్యది సిగ్గునకు దొలగిన వృత్తి యనియైన రోయక, తమ్ముమాత్ర మావేశించిన హక్కనియు గౌరవ విశేషమనియు వారు తలయెత్తికొని తిరుగుట దలపోయ నీరాజ్యమున నొక్కమతమేకాదు మానమును నిలువకపోయెనో యని సంశయింపవలసియున్నది.