పుట:Bhaarata arthashaastramu (1958).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వార్ధదేశార్థక్రియలు

సార్థకక్రియలన నర్థములు రెండు. తనకు సంపదల దెచ్చునది; దేశవిభూతి నుద్ధరించునది యని. ఇందు రెండవ యర్థమే ప్రధానము. ఏవృత్తిగాని నిరాఘాటముగ నింద్యమే యనుట కష్టమేయైనను కాల దేశ వర్తమానంబులం బరిశీలించి దేశానుకూల వ్యాపారముల నాశ్రయించుట కర్తవ్యంబు.

ఉంఛవృత్తి

ఈ ప్రపంచమున నెక్కడనులేని వ్యవహారంబొకటి ఈ కర్మ భూమిలో ప్రబలమైయున్నది. అదియేదన ఉంఛవృత్తి. ఇది యనర్థ ప్రతిపాదక మనుటకు సందేహము లవమాత్రమునులేదు. బెల్లము గొట్టిన ఱాయివలె చియ్యచే నిగనిగలాడువారు తాము సోమరిపోతులై యుండుటయేకాక ఇతరుల కష్టార్జితంబుం దినుటయు, వీరింజూచి కర్మణ్యులును జీతమునకన్న భిక్షమే యెక్కువయని పనులు చాలించి వివిధ వేషంబులతో దేశాటనంబు జేయుటయు నిత్యాది విపత్తులు మనవారు మూర్ఖులై, పాత్రాపాత్రత గణింపక దానము లిచ్చినను పుణ్యము వచ్చునని, యెంచుటవలన గలుగుచున్నవి. దేశార్థపరిహీణత, దొంగతనము, ఆలుబిడ్డలను వదలుట, సోమరితనము, కైతవము మొదలగు దౌష్ట్యములకు నీమూఢభక్తి ముఖ్యకారణము దేశమునకు దౌర్భాగ్యముదెచ్చి పాడుసేయుట పంచమహాపాతకములకన్న మించిన పాతకముగాన ఈ విపరీత దానములచే స్వర్గలోక ప్రాప్తియగుననుట సత్య మెన్నటికినిగాదు. పరోపకారమనగా తాత్కాలికోపకారము గాదు. మఱి ధ్రువంబును దేశమునకు నెడరు గలిగింపనిదియునైన యుపకారము, దేశమునకు నపకారము జేయుట దేశస్థులకును ఇక ముందు బుట్టబోవువారికిని అవధి గల్పించుట గాదె! ఇందఱికిని ఎగ్గాచరించి తాముమాత్రము తటుక్కున స్వర్గమునకు బోవుదు రేని,