పుట:Bhaarata arthashaastramu (1958).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ష్కోణమువలన సూచితమగు నుపయుక్తికే మనము విలువ యొసగెదము. కావున వినియోగించు మనకు 'ఆ అ చ ఇ' చే గనుపఱచబడిన ఉపయుక్తి విశేషముగవచ్చినది. కావున నిది రెండుమణుగులున్నచో నైన వినియోజక శేషము.

ఆద్యోపయుక్తి (మొదటిమణుగు) = ఆ ఉ డ ఇ

మధ్యోపయుక్తి (రెండవమణుగు) = ఈ డ ఎ చ

అంత్యోపయుక్తి (మూడవమణుగు) = చ ఎ గ క

సమాసోపయుక్తి (అన్నిమణుగుల ఉపయుక్తి) = ఆ ఉ గ క చ జ ట ఇ

వెల కడపటి మణుగుంబట్టి నిర్ధారణ యగుటచేత మనము 'అ ఉ గ క' యను చతుష్కోణము వలన సూచితమయిన ఉపయుక్తికే వెల యొసంగెదము. మిగత 'ఆ అ చ జ ట ఇ' మనకు శేషము. ఇదియే మూడుమణుగు లున్నయెడల వినియోజక శేషము.