పుట:Bhaarata arthashaastramu (1958).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవరణంబు నిర్వికారంబుగాదు. మఱి కాలవిధేయంబై పరివర్తనలం జెందునది. మనుష్యులలోని యైశ్వర్యాంతరములకు నావరణంబు ముఖ్యాశ్రయము.

ఉదాహరణాదులు

నేయి యొక్క మణుగుమాత్రము దొరకునేని వెల మణువు 30 రూపాయలనియు, రెండుమణుగులు దొరకునేని వెల 25 రూపాయలనియు ననుకొందము. అప్పుడు వినియోజకశేషమెంత? -

తొలుతటి మనువు వెల 30 రూపాయలు
రెండవదాని వెల 25 రూపాయలు
మొత్తము 55 రూపాయలు

మూడు మణువు లుత్పత్తియై వెల మనువునకు ఇరువది రూపాయ లాయెననుకొందుము. వినియోజకశేష మింకను నెక్కును. ఎట్లన:-

ఒక్కటే మణుగునెయ్యికల సమయమున నుపయుక్తి 'ఆ ఉ డ ఇ' యను చతుస్కోణమువలన గనుపఱచబడినది. రెండవ మణుగుయొక్క యుపయుక్తిని 'చ డ ఎ క' యను చతుష్కోణము వ్యక్తము చేయుచున్నది. మొత్తముమీద నుపయుక్తి 'ఆ ఉ డ ఇ' + 'చ డ ఎ క' లేక 'ఆ ఉ ఎ క చ ఇ' కాని విలువ కడపటిమణుగుంబట్టియే ఏర్పడుటవలన రెండు మణుగులకునుజేరి 'అ ఉ ఎ క' యను చతు