పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26

భారతనీతి కథలు - రెండవ భాగము.

కతిపయ దినంబులకు ద్రుపదపురంబుప్రవేశిండి, నాలుగు సముద్రంబులుసో లె ఘల్లి మ్రో యుచున్న పురమునకు నాలుగు దిక్కులను విడిసి యున్న నానా దేశాగత మహీ నాధుల బహువిధ స్కంధా వారంబుల జూచుచు బోయి, తమ్మునన్యు లెఱుంగకుండ నొళ కుంభ కార గృహంబున విడిసిరి.

ద్రుపదుఁ డర్జునునిచే నోడింపబడి దోణునకు గురు దక్షిణగా నొసంగబడినకథ బాలురకు జ్ఞప్తియుండవచ్చును. ఆసటినుండియు ద్రుపదుఁడు దోణునియందు మత్సరముళల వాడై , దోణుని వధించునట్టి కొడుకును నర్జునునకు భార్య యగునట్టికూతునుం బడయదునని నిశ్చయించుకొని బ్రాహ్మ ణుల నాశ్రయించి పుత్రకామేష్టి యస్వయజ్ఞమును గావించెను. ఆయజ్ఞంబున పగ్ని దేవుఁడు వానికిఁ బ్రసన్నుఁడై ధృష్టద్యుమ్నుం డను కుమారునిఁ గృష్ణయనుకుమారికను ననుగ్రహించెను.

పొండవులు లక్కయింటఁ గడ తేరను వార్తలు విన్నది మొదలుగ ద్రుపదుఁడు ఖన్నుండై యర్జునుఁడు తనకల్లుఁడు కాఁగలభాగ్యంబు బోయెనని వగచుచు, నింకనుననుమానంబు తీరక పాండవు లెం దైనఁగల రేమోయని నానా దేశంబులు వెద కించెను. కానివిప్ర వేషధరు లై యున్న వారి నెవ్వకును గుర్తింప లేకపోయిరి. ఆ కారణంబునఁ బాంచాలపతి స్వయంవరము చాటిం చెను. అంతరిక్షంబున నొళమత్స్యయంత్రమును లక్ష్య ముగా సమర్చి యత్యున్నతంబును మహా భారంబునగు విల్లు