పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(2)

సంవరణ చరిత్రము - పురోహిత ప్రభావము.

9


లోకలోచనుండైన కమల బాంధవుని సందర్శించి వేదమంత్రంబులనెంతయు సన్నుతించెను. మునీశ్వర వరిష్ఠుండై న వసిష్ఠుని లోకబాంధవుఁ డతిగౌరవంబున సంభావించి “మహాత్మా ! మీ యాగమనంబునకుం కారణంబే" మని యడిగెను. తోడనే వసిష్ఠుఁడు, ప్రభాకరా! మా రాజు సంవరణుఁడు. విద్యాగుణ సౌందర్య లావణ్యాదులయందు నీ తనయకుం దగిన వరుండు. కూఁతుంగన్న ఫలంబుగా నీవక్కన్నియనాతని కొసంగవలయు " నని యడిగెను. భగవానుడాతని నెంతయు నాదరించి, మహాత్మా ! రాజవంశకరుండైన సంవరణుండే తపతికిం దగినపతి" యని పలుకుచు, నాక్షణమె యక్కన్యా రత్నమును వసిష్ఠువెంటఁ బుత్తెంచెను.

ఇట్లొక్క నిమిషార్ధంబున రెండువేల యోజనంబులు నడచు నాదిత్యురధంబుతో నశ్రమంబుననరిగి తపనదత్తయైన తపతిం దోడ్కొనివచ్చి, వసిష్ఠుండు విధివంతంబుగాఁ తన రాజునకు వివాహంబు చేసెను. కావున మహాత్ములైన పురోహితులం బడసిన రాజులకు నిష్టశుభంబులగుట నిశ్చయంబు.

ఉ. వేదము వేదియుంగలుగు విప్రనరేణ్యుఁడగణ్య పుణ్య సం
    పాదివురోహితుండయినఁ బాపమువొందునెభూపతింబ్రతా
    పోదయ కాన మీదగు గుణోన్నతికిందగు ధర్మతత్వ సం
    వేదిఁ బురస్కరింపుఁడు ఫవిత్రచరిత్రు మహీసురోత్తమున్

____________