పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

భారతనీతికథలు - రెండవ భాగము


3. విశ్వామిత్రుఁడు - గర్వభంగము.


గంధర్వుడు చెప్పిన కథవిని పాండవులు మిక్కిలిసంతసించిరి. ఆతపతీ సంవరణులకుఁ బుట్టిన కురుని మూలంబుననే మీవంశము కౌరవవంశమయినదనికూడ నాతఁడు వారి కెఱింగించెను. అంతయువిని యర్జునుండత్యానంద భరితుఁడై గంధర్వోత్తమా ! పూజ్యులును బుణ్యభాగులును నగు మాపూర్వులకుఁ బురోహితుఁడైన వసిష్టమహర్షి మహాత్మ్యత మేమింకను వినఁగోరెదము. మమ్మనుగ్రహించి వచింపు మని ప్రార్థింప గంధర్వుండిట్లనియె.

తొల్లి కన్యాకుబ్జంబున గాధిన దనుండు విశ్వామిత్రుండను రాజుకలఁడు. అతఁడు తన పరాక్రమాతి శయంబున ధాత్రి నిరమిత్రంబుగాఁ జేసి తన్నెదుర్కొను వారు లేకుండ నిర్భయంబుగ రాజ్యపరిపాలనము గావించుచుండెను. తానుక్షత్రియుండగుటయుఁ దన్నెదిరింపగల శత్రుబలంబులు లేకుండుట యుఁదలఁచి, గాధేయుఁడు క్షత్రబలంబుకంటె మించిన బలంబులేదని గర్వించుచుండెను. ఆ గర్వాతిశయంబున నతండు బ్రాహ్మణ ప్రభావంబులను గాని తపఃప్రభావంబులను గాని లేశమును బాటింపకుండెను .

ఇట్లు రాజ్యమదాంధుఁడైన విశ్వామిత్రుం డొక్క నాడు మృగయా వినోదార్ధం బపారసేనా సమేతుండై మహారణ్యంబుల కరిగి, పెద్దయుంబ్రొద్దు వేటాడి మిక్కిలి