పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుస్తకములు విశేషము వెలగలవి, సర్వజనోపయోగముగల పుస్తకభాండాగారములు లేవు; గృహస్థులు తగుమాత్రము స్వోపయోగమునకు వానిని సంపాదించుటకలదు, మతగ్రంధములను దప్ప, తదితరగ్రంధములను పఠన జేయువారు లేరు. బెంజమిను యొక్క చిన్నతనములో, గ్రంధపారాయణచేయు వాడనినను, యేబదిసంపుటములను సంపాదించిన వాడనినను, అట్టివానిని గౌరవముగ నితరు లెన్నుటకలదు. మొదటినుండి, పాండిత్యమును నూతన సీమలవాసు లెన్నికతో జూచుచుండిరి.

1724 సంవత్సరమున 'విలియంబర్నెటు' అను నతడు న్యూయార్కు పట్టణమున గవర్నరుగనుండెను. 'పనిముందు, తరువాత నాలోచన' జేయువాడీగవర్నరు. నూతన సీమలలోని యధికారులతో జిరుకలహములాడి, గవర్నరు తనమంచి ప్రాయమంతయు బోగొట్టుకొనెను. స్థాపింపబడినపుస్తక భాండాగారములలో మంచి దొకటి గవర్నరుకు గలదు. పుస్తకములనిన, వానిని జదువువారనిన, నితనికి బ్రాణము. బోస్టనునుండి వచ్చు ప్రయాణికులలో నొకడు కొన్ని సంపుటములుగల వాడని నతడు పడవలోనుండెనని, పడవయధికారివలన, గవర్నరు వినెను. అతనిని తనయొద్దకు, తీసికొనిరమ్మను మని పడవయధికారితో గవర్నరు చెప్పెను. "నేను గవర్నరును జూచుటకు వెళ్లితిని. కాలిన్సుత్రాగి తెలివిలేక పడియున్నందున నాతో వానిని తీసి