పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముండుటవలన, బెంజమిను ముందుకు నష్టమును బొందవలసి వచ్చెను. పెన్సిలువానియాలో, 6, 7 కాసులు ఋణముక్రింద నియ్యవలసిన వానియొద్ద నాసొమ్మును బుచ్చుకొనవలసిన దని, తన యన్న స్నేహితుడు 'వెర్నను' అనువాడు బెంజమినుకుత్తర మిచ్చెను. తానుదిరిగి వ్రాయువఱకు వసూలుచేసిన సొమ్మును బెంజమినునే జాగ్రత్తచేయుమని వెర్నెను చెప్పెను. ఈ పనిని జేయుటకు బెంజమి నొప్పుకొనెను.

'న్యుపోర్టు' పట్టణము వదిలి 'న్యూయార్కు'కు వచ్చునప్పటికి, బెంజమినుతో గలిసి ఫిలడల్‌ఫియాకు బోవుట కితని స్నేహితుడు, కాలిన్సు ఎదురు చూచుచుండెను. గృహమునుండి వెలువడివచ్చినది మొద లతని నడవడి చెడినదని స్నేహితులవలన వినినందు కెంతయు బెంజమిను విచారించెను. సోమరియై, కాలిన్సుత్రాగుబోతాయెను. ఇతను న్యూయార్కులో జేసిన ఋణములనుదీర్చుటయేగాక, ప్రయాణములోనితని కర్చులకు గావలసిన సొమ్మును బెంజమిను పెట్టెను. ఇందులకు, బెంజమిను ముందుకు విచారింపవలసివచ్చెను. బెంజమిను తలచుకొన నదియు, యతనికి బ్రీతికర మగునదియు నగుసంగతి యొకటి న్యూయార్కు పట్టణములో జరిగెను.

నూతన సీమలలో నుండువారికి పుస్తకాపేక్ష, యన్యోన్యానురాగము నాపాదించునని తలంపవచ్చును. ఆకాలమునందు