పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని వెళ్లుటకు వీలులేకపోయెను. గవర్నరు నన్ను మర్యాదచేసి, తన పుస్తకములన్నియు నాకు జూపించెను. కొంతవఱకు పుస్తకములు, గ్రంధకర్తలనుగుఱించి మేము ముచ్చటించితిమి. నన్ను గౌరవించి, నాతో మాటలాడిన వారిలో నితడు రెండవ గవర్నరు. ఇట్టిసన్మానము నావంటి దీనుల కెంతమనోల్లాసముగ నుండు?"నని యతడు వ్రాసెను.

బెంజమిను, కాలిన్సు, లిరువురు బయలుదేరి ఫిలడల్‌ఫియాకు పోయిరి. వెర్ననుకు రావలసిన సొమ్మును మార్గములో బెంజమిను వసూలు చేసెను. కాలిన్సు, దురాపరి కర్చుదారుడైనందున, నతని నిమిత్తము కొంతయు తనవిషయమున కొంతయు ఈ ధనములో నుండి బెంజమిను వ్యయపఱుపవలసి వచ్చెను.

ఈకాలమందు, డెలవేరు నదిమీద ప్రయాణము జేయునపుడు జరిగిన విశేషమును, మరి 55 సంవత్సరములయిన పిదప, శాస్త్రజ్ఞుడైన 'ప్రీస్టి'తో బెంజమిను చెప్పెను. దీనిని 'ప్రపంచమునందలి యన్ని యవస్థలు తద్ధర్మానుసారముగ నొడుదుడుకులు గలవి మనుజులు బ్రస్తుతావస్థసంబంధ దు:ఖము లనుభవించుచు తాము కోరు అవస్థలలో నెట్టి శ్రమలుండునో తెలియనేరరు" అను నీతివాక్యమును ముచ్చటించు సందర్భమున చెప్పెను.