పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కావ్యములను, సంక్షిప్తమతబోధకోప న్యాసములను ఇతని పినతండ్రి యింగ్లాండు దేశమునుండి తీసికొని వచ్చెను. అతడు సూచిభావసమన్విత విమర్శనాయత్త చిత్తంబున కపటరాహిత్య మనోవ్యాపారముల నాపాదించు సరసోల్లసిత, చతుర భాషణంబులచే యుక్తియుక్తముగ తన పేరింటిగానికి బుద్ధులు గఱపి, సంకేతలిపిని నేర్పి, తనకుంబలె సన్మార్గప్రచారణీయునిగ జేసి, యతని నీటిప్రయాణ సన్నాహమును నిషేధింపించెను. నాలుగు సంవత్సరములు దనయన్న గారి గృహమందు నివసించి, తనకుమారుడు, సామ్యూల్, వివాహమాడి, వేరు కాపురము పెట్టినందున, పినతండ్రి బెంజమి నక్కడ నివసించుటకు బోయెను. ఇతడు 77 సంవత్సరములు జీవించి, 1727 సంవత్సరమున లోకాంతర గతుడయ్యెను.

యౌవనుడైన బెంజమినుయొక్క విద్యాసక్తి, యౌవనవంతులచే బరింపదగిన గ్రంధములయందు బ్రసరించుటయే గాక, జ్ఞానోదయోద్దేశ సద్గ్రంథపారాయణమును సహితము బ్రేరేపించెను. బనియనువ్రాసిన "యాత్రికుని సంచారము" అను గ్రంధము, ప్లూటార్కు వ్రాసిన "మహనీయుల జీవనములు"ను నతనికి శ్రేయోదాయకములయినవి.

"నేను చదువుకొను దినములలో" "మీతండ్రిగారివలన వ్రాయబడినదని నే ననుకొనుచున్న 'సన్మార్గోపదిష్ట వ్యాసము'