పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను పేరుగల గ్రంధము నాకు దొరకినది. ఈగ్రంథమిదివఱ కెవరిదో, వారు దీనిని నిరాదరణతో జూచుచుండి రనుటకు తార్కాణముగ, దీనియందు కొన్ని పత్రములు చినిగి యున్నవి; అయినను, శేషించిన పత్రములను జదువుటవలన, నాయోచనావృత్తి నూతనపథాన్వేషణ విముఖియై, యావజ్జీవము నన్ను సన్మార్గప్రవర్తకునిగ జేసెను. కీర్తిదాయకములైన వ్యాపారము లన్నిటిలోను, సత్కర్మనిరతుల నడవడిక లమూల్యములని తోచుచున్నది. తమరనుకొనుచున్న ప్రకారము, నేనే సర్వజనోపకారియైన యెడల, నేనటు లనిపించుకొనుటకు గారణ మీ గ్రంథమేయని యూహించవలెను" అని లేఖను వ్రాసెను.

మతాచారముతోను నిష్ఠతో నితనిని బెంచిరి. విధిప్రకారము సోదర సోదరీలతో నితడు క్రైస్త్వాలయమునకు వెళ్లవలసియుండెను. అన్యోన్యానురాగముతో బిడ్డలు తలిదండ్రులయెడ శ్రద్ధాభక్తి వినయపూర్వకముగ నడచుచుండిరి. భోజనాద్యంతముల జేయుప్రార్థన చాలకాలము బట్టుచున్నందున, నది మనస్కరించక, "నాయనగారు దైవప్రార్థన నొకమాఱు సేసిన, కాలాతిక్రమణము జరుగ దని" బింజమిను నుడివెను.

మొత్తముమీద, బెంజమిను బాల్యావస్థ సౌఖ్యముగ జరుపబడెను. జీవితాంతమువఱ కే బోస్టనుపట్టణమందలి యవస్థనే నతడభిలషించుచుండెను, 82 సంవత్సరములు ప్రాయ