పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డబ్బులన్నియు ఆ బాలుని కిచ్చివేసి, యాయీలను బుచ్చుకొంటిని. దానిని బట్టుకొని, యింటికివచ్చి, మహోల్లాసముగ నీలగొట్టుచు, నింటినాలుగు వైపులు తిరిగి నందున, నింటి వారందఱు చికాకుపడిరి. నాయన్న దమ్ములు, చెల్లెండ్రు, నేను గొన్నవస్తువును జూచి నవ్వి, దాని ఖరీదు కంటె నాలుగు రెట్లు హెచ్చుసొమ్ము నిచ్చినా నని చెప్పి, పరిహాసము జేసినందున, నాకు విచారము గలిగి, యీలకొనిన సంతోషము లేక పోయెను. హెచ్చుగనిచ్చినసొమ్ముతో దీనికంటె మంచివస్తువులను గొనుటకు వీలుపడియుండు ననుట నా మనస్సును సదా నొప్పించుచున్నందున, నుత్తరోత్తర మిది నాకు మేలును గలుగ జేసెను. ఎన్నడైన, ననుపయోగమైన వస్తువును గొనుటకు నుద్యుక్తుడ నైనప్పుడు, ఈలకు వలె హెచ్చు సొమ్ము నిచ్చి వేయుదు నేమోయని జ్ఞప్తికి దెచ్చుకొనుచు, ధనమును వృధావ్యయముజేయుట మానివేసితిని" అని ఫ్రాంక్లిను తన స్వీయ చరిత్రయందు వ్రాసియున్నాడు.

చిన్న నాటనుండి, బెంజమిను పుస్తకములు చదువుట యందాసక్తి జూపుటచే, నితనిని గ్రైస్తవధర్మమునకై నియోగింపవలె ననితండ్రి యాలోచించెను. ఈ నియోగమును పినతండ్రి బెంజమినుగూడ నంగీకరించి, తనవద్దనున్న ప్రాచీన మతోపన్యాస సంపుటముల నితని కిచ్చెను. జోషయాయను