పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నతడు తప్ప, ఇతని యితర సహోదరులు స్వానుగుణోచితవ్యాపారములయందు ప్రవేశించిరి. బెంజమిను శిశువుగ నుండినపుడే, "జోషయా" యను యన్నగారు సముద్రముపైని దేశాంతరగతు డయ్యెను.

8 సంవత్సరములు ప్రాయ మప్పుడు, "బోస్టను వ్యాకరణ పాఠశాలలో" బెంజమిను ప్రవేశ పెట్టబడెను. మొదటి సంవత్సరమున, ఇతడు తన తరగతిబాలుర నతిక్రమించి, పైతరగతి చదువునకు యోగ్యతాపత్రికను పుచ్చుకొను సమయమున, కుటుంబ భార మత్యధికమై నందున ఇతనితండ్రి, పై చదువు చదివించుట తనస్థితికి మించిన పనియని యాలోచించి, కుమారుని చదువు మాన్పించెను. కొంతకాలమునకు పిదప బోధన, లేఖన, గణితము లందు ప్రవీణుడని పేరొందిన "జార్జిబ్రాము వేలు" పెట్టిన పాఠశాలకు బెంజమినును బంపిరి. ఒక సంవత్సర పర్యంత మా పాఠశాలలోనుండి బాగుగ వ్రాత వ్రాయుట నేర్చుకొనెను గాని, గణితము మాత్ర మతనికి బట్టువడలేదు. పదిసంవత్సరముల ప్రాయము వచ్చుసరికి, విద్యాభ్యాసము సరిపోయినది. నాటనుండి వ్యాపారములోదిగి, తండ్రికి సహాయము జేయుచు, మూసలలో కఱగిన క్రొవ్వునుపోసి వత్తులనుదింపుచు, దుకాణము వద్ద సరకులనమ్మి, జాబులను వ్రాయుచు వచ్చెను. ఈ వ్యాపార మెంత యసహ్యకరమైనను, శ్రద్ధాభక్తులతో దానిని జేయుచు,