పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడు పాఠశాలలో తగుమాత్రము విద్యనభ్యసించెను. పూజ నీయుడైన తండ్రి, ప్రేమాస్పదయైన తల్లి వీరిరుగురు పురుషార్థములకయి జఱపిన గృహస్థాశ్రమము, ప్రత్యక్షకాలవి స్ఫారితవిషయావలోకనము, తండ్రిగారి పుస్తకములు, స్నేహితులు, వీనిని మించి పినతండ్రి బెంజమిను పంపిన యమూల్యనీతి బోధక లేఖలు, చిన్ని బెంజమినునకు మార్గసూచకము లయ్యె.

బుద్ధిని వికసింపజేయు నీ విషయములు, బెంజమినునకు 9 సంవత్సరములు ప్రాయము వచ్చువఱకు బ్రసరించెను. బాలుడు మందబుద్ధియైన పక్షమున నివి శ్రేయోదాయకము లయినవో, కానివో, విమర్శించుటకు ఎడ ముండియుండును. కాని సహజముగ సూక్ష్మబుద్ధిగలవాడై, నూతనవిషయ పరిగ్రహణేచ్ఛ గలిగి, మేధావియైన బెంజమిను విషయమై, యివి శ్రేయోదాయకము లని వేరుగ చెప్ప నేల?

ఈయన బాల్యావస్థలో జఱిగిన ఒక్క యంశము సర్వజన సామాన్యముగ తెలిసినదే. "నే నేడు సంవత్సరములు ప్రాయముగల వానిగ నున్నప్పు" డొక పండుగ రోజున నా స్నేహితులు నా జేబునిండ డబ్బులు వోసిరి. వెంటనే, నేను పిల్లలాడుకొను వస్తువులు దొరకు దుకాణమునకుబోయి, యక్కడ యాకస్మికముగ నొక బాలుని చేతిలోనున్న యీలనుజూచి, దాని ధ్వనిని విని సంతసించి, నా జేబులోని