పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలసినవి ఈతని యందు లేకుండెను. దీనింబట్టియే "తన మేలుకు మించిన లౌకికుడు" అని ఇతని యన్న కుమారు డితని విషయమై వ్రాసెను. దీనికి తోడుగ, సంసారదు:ఖము లితనిని బొందసాగెను. క్రమముగ, భార్య తొమ్మండుగురు పిల్లలు వియోగమంద, నితని లౌకిక వ్యాపారము లన్నియు నానాటికి క్షీణించెను. కాని, యెన్ని కష్టములు వచ్చినను, మనస్సును దృడముగ నిలుపుకొని, చిదానంద స్వరూపుడై, తనకు లభించిన గ్రంధములను జదువుచు, కాలయాపనము జేసెను. వ్యాసములు, మతబోధకవచములు, మొదలగువానికితడు సంపాదకుడుగ నుండెను. తనకాలమునందలి రాచకీయ విషయముల కనుగుణ్యముగ తానుచేసిన స్వరలయ రాహిత్యమైన పాటల బాడుటయం దత్యధికాసక్తి జూపుచు వచ్చెను. భార్యాపుత్రాదుల వియోగముబొంది, స్నేహితులచే విడనాడబడి సహించి, తన యన్న కుమారుడు తన పేరుకలవా డనివిని సంతసించి, వానియోగక్షేమము లఱయుచు వచ్చెను.

"జోషయా", "బెంజమిను" లిరువురును, తమ యోగ క్షేమములను నుత్తర ప్రత్యుత్తరములచే తెలిసికొనుచుండిరి. అవి వీరి వంశచారిత్రయందిమిడి యున్నవి. నానాడు తనయన్న కుమారునికి బెంజమిను బంపిన పద్యము లీ బాలుని జీవనము విషయమై తెలియదగిన ప్రధమాంశముల కాధారములు.