పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందు రచింపబడిన పాటలను, కీర్తనలను గానము జేయుచు, దనవారి నందఱను ఉల్లసింప జేయుచుండును. అతనికి కంఠస్వర-వీణెస్వరములు, పూర్ణాయుర్దాయుడై మనిన అతని కుమారునకు యావజ్జీవము వినబడుచు వచ్చి, తండ్రిగారితో నాట పాటలయందు గడపిన సాయం సమయములు జన్మాంతము వఱకు జ్ఞప్తికి వచ్చుచుండెను. జాగరూకత, నూతన విషయములను దెలిసికొనుటయందాసక్తి, స్వచ్ఛమైన మనస్సు, వీనిని గలిగి, బుద్ధిమంతులును తెలివిగల వారును నగు స్నేహితులతో మెలగుచు, వారితో గోష్ఠిచేయుటయం దిచ్ఛగలవాడై యుండెను. యుక్తాయుక్త విచక్షత, నిర్మలత్వము, సౌహార్దముకలవాడని మెప్పువడసినందున, నిరుగు పొరుగువారేమి, పౌరవ్యాపారములలోను, దేవస్థానవిషయములలోను దిరుగుచున్న పెద్దలేమి ఇతని సలహాను గోరి వచ్చుచుందురు. శుద్ధుడు, శాంతుడు, దాంతుడునై, కార్యములను పూనికతోను, నేర్పుతోను, చాక చక్యముతోను ఇతడు నెఱవేర్చుచుండెను. కావుననే 'ఆబియాఫోల్జరీ' యీయనను జేబట్టి, యీయన కార్య నిర్వాహక భారమునుగొంత తాను శ్రద్ధాభక్తులతో వహించెను.

ఈ దంపతులకు పదుగురు బిడ్డలైరి. 1690 సంవత్సరము డిశంబరున, జాను; 1692 సంవత్సరము నవంబరు 22 తేదిని, పీటరు; 1694 సంవత్సరము సెప్టెంబరు 22 తేదిని, మేరీ యను