పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూతురు, 1697 సంవత్సరము ఫిబ్రవరి 4 తేదిని, జేమ్సు; 1699 సంవత్సరము జూలై 9 తేదిని, సారా యనుకొమార్తె; 1703 సంవత్సరము డిశంబరు 7 తేదిని, తామసు, 1706 సంవత్సరము జనవరి 6 తేదిని, బెంజమిను ఫ్రాంక్లిను; 1712 సంవత్సరము మార్చి 27 తేదిని, జేను యను కొమార్తెయు బుట్టిరి. 'జేను' అందఱిలోను చాల చక్కనిది. అందఱికి ముద్దు బిడ్డ. బెంజమినునకు ముద్దు చెల్లెలు. వీరిరువురు అఱువది వత్సరములవఱ కుత్తర ప్రత్యుత్తరములను జఱపుచుండిరి.

'బెంజమిను ఫ్రాంక్లిను' ఆదివారమున బుట్టెను. క్రైస్త్వాలయమున కిరువది గజముల దూరములో వీరి గృహ ముండెను. తండ్రి ఈ శిశువును జేతులలోనుంచుకొని, ఆసమీపమున నున్న యాలయమునకు దీసికొని వెళ్లి, ఆలయాధికారియైన 'డాక్టరు విలార్డు'చే, శిశువునకు జ్ఞానస్నానము జేయించి 'బెంజమిన్‌' అని తన తమ్ముని పేరిడెను.

పెద్దకుటుంబములో జన్మించి పెఱుగుట శిశువుయొక్క పురాకృత పుణ్యఫలమేగాని మఱియొకటికాదు. చెడుమార్గముల యందు బ్రవర్తించుటకు శిశువున కవకాశములు తక్కువగ నుండును. తన్ను బ్రేమించువారు చాలమంది యనియు, తాను చాలమందిని బ్రేమించవలె ననియు తెలియును. పదిమందిలో తానొక్క డనే భావమును బొంది, వారలకు గూడ