పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేర్పు చుండెను. 'పరిమాణశాస్త్రము' (Survey) నందు బ్రవీణుడు గాన, నూతనవాసుల యాశ్రమములను వేర్వేరుగ స్థిరపఱచుటయం దితడు ప్రయాసపడుచు వచ్చెను.

ముప్పదియయిదు సంవత్సరములవయస్సు, పెరిగిన యారుగురు పిల్లలు, క్రొవ్వు వ్యాపారము - ఇట్టి సంపత్తితో, పండితుని మర్యాదగ కాలము పుచ్చుచున్న వాని కూతురును 22 సంవత్సరముల వయస్సుగల స్త్రీని, జోషయా ఫ్రాంక్లిను వివాహమాడి, యామెకు దన పిల్లల నప్పగించి, వారి విషయమై యామె పాటుపడునట్లు చేసెను. అట్లు చేయకపోయిన పక్షమున వీరిదాంపత్య మనుకూలము లేక యుండియుండును. ఇంపైన విగ్రహమును, సరసపు మాటలును, లౌకిక బుద్ధియునై కేవలము కుఱుచగాక, కేవలము పొడవుగాక, పటుత్వము, దార్డ్యము, బలముగలిగి జోషయా ఫ్రాంక్లిను పనులును నేర్పుగ నెరవేర్చుచుండెను. ఆయన "యవయవములు" అతని పూర్వుల జన్మభూమి ఇంగ్లాండని తోపజేయుచుండెను. నీటుగ, తేటుగ, బొమ్మలను వ్రాయుటయందును, వీణెను జక్కగ మీటుటయందును అతడు నేర్పు గలవాడు. అతని కంఠము శ్రావ్యముగనున్నను, గొంచెము బొంగుగ నుండును; సాయంసమయమున, తన నిత్యకృత్యములను ముగించుకొని, వీణెవాయించి పాడుచు, తన జన్మదేశము