పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36-సంవత్సరములకు బూర్వము కట్టబడి, అప్పటికి అయిదాఱు వేల ప్రజాసంఖ్య గల 'బోస్టను' పట్టణము బ్రవేశించి, రంగు లద్దువ్యాపారమునకు దగిన ప్రోత్సాహము లేనందున, 'జోషయాఫ్రాంక్లిను' క్రొవ్వు కఱగించి, సబ్బు తయారుచేయు వ్యాపారమునందు బ్రవేశించెను.

బోస్టనుపట్టణమునం దిటుల తన శాయశక్తుల వ్యాపారమును నడిపించుచు, నాలుగు డబ్బు లితడు సేకరించెను. ఇతని కుటుంబము సయితము నానాటికి వృద్ధిబొందెను. 1685 సంవత్సరం ఆగస్టు తే-23 దిని, ఇతనికొక కుమారుడు గలిగెను. వానికి జోషయా యని నామకరణ మొనర్చిరి. సముద్ర మార్గమున పారిపోయి, చాలకాలము వఱకు దన క్షేమసమాచారముల దెలియ జేయనందున వీరు తల్లి దండ్రులకు దు:ఖము గలుగజేసినవా డయ్యెను. ఇతనిపోలిక ననుసరించి యితని కనిష్ఠభ్రాత, బెంజమిను అనువాడు గూడ నటులనే చేసెను. 1687 సంవత్సరము జనవరి 5 తేదిని, జోషయా ఫ్రాంక్లినునకు 'ఆని' యనుకూతురు పుట్టెను. 1688 సంవత్సరము ఫిబ్రవరి 6 తేదిని జోసెఫనువాడు పుట్టి, శైశవదశయందే స్వర్గస్థుడాయెను. తరువాత 1689 సంవత్సరము జూన్ 30 తేదిని మఱియొక జోసెఫను కుమారుడు గలిగెను. ఏడుగురు బిడ్డలనుకని తనకు 35 సంవత్సరముల వయస్సున, జోషయా ఫ్రాంక్లిను గారి