పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భార్య స్వర్గస్థురాలాయెను. అప్పటికి పెద్దవాడు 16 సంవత్సరముల ప్రాయమువాడు - చేతివాడు నెలలకందువ - కడమవారులే బ్రాయపువారలు - వీరలను బెంచి పెద్దవారిని జేయుభారము తండ్రిపై బడెను. ఇట్టి యవస్థలో మఱియొక యాధారము లేనివాడై, తాను చెమట నూడ్చి కష్టార్జితముగ సంసారము గడపవలసినందున, తన పిల్లల సంరక్షాణార్థమై, అతడు తిరుగ వివాహ మాడవలసి వచ్చెను. సంవత్సరము వెళ్లుపర్యంత మాపుచేయవలసిన యాచార మున్నను, నట్లు చేయక, వెంటనే అతడు ద్వితీయ కళత్రమును స్వీకరించెను. ఈ కళత్రమునకు గలిగిన ప్రధమసంతానమునకును ప్రధమకళత్రమునకు గలిగిన కడపటి సంతానమునకును పదునెనిమిది మాసములే వ్యత్యాసము. 'నాన్టుకెటు' దీవిలో బ్రధమవాసులలో నొకడైన 'పీటరుపోల్‌జరు' గారి చిన్నకూతురు 'ఆబయా' యను నామెయే ఈ రెండవభార్య. ఈమెను వివాహ మాడుసరికి నీమె 22 సంవత్సరముల ప్రాయముగలది.

'పీటరుపోల్‌జరు' విషయమైమనము చెప్పవలసినదెమనగా, బెంజమిను ఫ్రాంక్లినున కీయనతగిన మాతామహుడు; 'లెస్సగ చదువుకొని దైవభక్తిగలవా'డని నితని సమకాలికు డొకడు ఇతనిని స్తోత్రము జేసెను; 'పశ్చిమయిండియా' భాషలను నేర్చుకొని, యా దేశపుబాలురకు జదువను వ్రాయను ఈయన