పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుదును. ముందుసంగతి దైవమెఱుగు"నని బెంజమిను వ్రాసెను. తనను జూచుటకువచ్చిన వారి కతడు దర్శనమిచ్చుచుండెను. ప్రియ స్నేహితుల కుత్తరములు వ్రాయుటకలదు. 1788 సంవత్సరము అక్టోబరు నెలలో నితడు పనులన్నియు మానివేసెను.

వృద్ధాప్యము చేత నితనిశరీరమునకు దఱుచుగ బాధకలుగుచుండెను. బాధ లేనిసమయమున, నత డుత్తరములు వ్రాయుటయో, లేక స్నేహితులతో ముచ్చటించుటయో, లేక మనుమలతో నాడుటయో, జరుపుచుండెను. ఎన్నడును వ్యర్థముగ నితడు కాలయాపన చేయ లేదు.

1790 సంవత్సరము ఏప్రిలు నెల వఱ కిత డేవ్యాధియు లేక యుండెను. అప్పుడు గుండెలలో నొప్పి, యుష్ణము బెంజమినుకు వచ్చెను. డాక్టరు 'జానుజోన్సు', అను వైద్యు డితనికి మందు నిచ్చుచుండెను.

"మరణమునకు పదియారు రోజులు ముందుగ బెంజమిను కుష్ణమువచ్చెను. తరువాత మూడు నాలుగు రోజులకు, గుండెల కెడమప్రక్కను నొప్పిగనున్న దని అతడు చెప్పెను. ఆనొప్పి యధికమై, దగ్గుపుట్టి, యతనికి శ్వాసారంభమయ్యెను. అతడు బాధచేత మూలుగును, విశేషము బాధ తనకులేదని చెప్పు