పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. మొదట ననామధేయుడుగనుండి, తుదకు పేరు ప్రతిష్ఠలను బొందినందు కతడు పరమేశ్వరుని కొనియాడి, ప్రపంచమునందు విరక్తిని బొందించుటకై తనకు బాధలుగలిగెనని చెప్పెను. మరి యయిదు రోజులకు మృతినొందు నను సమయమున, శ్వాసతగ్గెను. ఉష్ణముజారెను. అందుచేత నందఱితడు జీవించునని తలంచిరి. ఈలోపున నూపిరి తిత్తులలో కురుపు పుట్టి, బ్రద్దలయి నందున, నుచ్ఛ్వాసనిశ్వాసములణగి, మాంద్యము ప్రవేశించి, క్రమముగ 1790 సంవత్సరము ఏప్రిల్ 17 తేది రాత్రి, పదునొకండు గంటలకు, డాక్టరు బెంజమిను ఫ్రాంక్లిను పరమపదమును బొందె"నని డాక్టరు జోన్సువ్రాసెను.

ఏప్రిల్ 21 తేదిని, మృతకళేబరమును సమాధి స్థలమునకు దీసికొని వెళ్లినపుడు, 20,000 వేల ప్రజవెనుక నడిచిరి. క్రైస్త్వాలయములలోని గంటలను మెల్లగ వాయించిరి. ఓడలమీది జండాలు సగము దించివేయబడెను. అతని శరీరమును భూస్థాపనచేయు కాలమున, శతఘ్నులు ఘోషించెను. భార్యాభర్తల శరీరము లొక దాని ప్రక్కనొకటి సమాధిచేయబడెను. వీరి గోరీల మీదనున్న రాతిపలకలమీద, వీరి జననమరణముల సంవత్సరములు తప్ప మరియేమియు వ్రాయబడియుండ లేదు.